Jayamma Panchayati Review: జయమ్మ పంచాయితీ మూవీ రివ్యూ, పాత్రకు న్యాయం చేసిన సుమ

Published : May 06, 2022, 04:34 PM IST

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల చాలా కాలం తరువాత వెండితెరపై సందడి చేసిన సినిమా జయమ్మ పంచాయితి. ఈరోజు( మే6) థియేటర్లో రిలీజ్ అయిన ఈసినిమా ఎంత వరకూ ఆడియన్స్ ను ఆకట్టుకుందో చూద్దాం.   

PREV
17
Jayamma Panchayati Review: జయమ్మ పంచాయితీ మూవీ రివ్యూ, పాత్రకు న్యాయం చేసిన సుమ

సుమ కనకాల సినిమాల్లో నటించి చాలా కాలం అవుతుంది. బుల్లి తెరపై సీరియల్ యాక్టర్ గా ఎంటర్ అయ్యి.. యాంకర్ గా మారిన సుమ, ఆతరువాత యాంకర్ గా ఇంత వరకూ ఎవరూ కొనసాగనన్ని ఏళ్లు నిర్విరామంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల వేడుకలలో సుమదే సందడి. ఇక చాలా కాలం తరువాత జయమ్మ పంచాయితీ సినిమాతో వెండితెరపై మెరిసింది సుమ. 

27

ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. శ్రీకాకుళంలో నివసించే జయమ్మ తన భర్త మరియు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది, అయితే భర్తకి ఒక జబ్బు ఉండటం వల్ల తన భర్తను చూసుకోవడానికి ఆమెకు డబ్బు అవసరం పడుతుంది దింతో ఆమె తన సమస్యను పరిష్కరించుకోవడానికి గ్రామ పంచాయతీని ఆశ్రయిస్తుంది. అయితే అక్కడ ఆమె సమస్యని విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు, అదే సమయంలో గ్రామ సభలు మరొక సమస్యను పరిష్కరించడంలో తలమునకలై ఉంటారు. చివరకు గ్రామ పంచాయితీలో జయమ్మ సమస్య  పరిష్కారం అయ్యిందా...?  ఇక్కడ పుట్టుకొచ్చిన మరొక సమస్య ఏమిటి అనేది మిగిలిన కథ.

37

ఇక ఈసినిమాలో నటీనటుల  గురించి చెప్పాలంటే సుమ పాత్ర పూర్తిగా ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తెరపై సుమ కంటే జయమ్మ  పాత్రమాత్రమే ఆడియన్స్ ఫీల్ అయ్యేంతలా నటించి మెప్పించింది సుమ కనకాల.   అలాంటి ఇన్‌వాల్వ్‌మెంట్‌ను సుమ పాత్రకు అందించింది. ఇది ఖచ్చితంగా సుమకు సిల్వర్  స్క్రీన్‌పై ప్లస్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే, సుమ లుక్స్‌తో కూడా క్యారెక్టర్‌కి సరిగ్గా సరిపోయింది. శ్రీకాకుళం ప్రాంతంలోని భాష, యాసను మాట్లాడటంలో  కూడా సుమ సక్సెస్ అయ్యింది. దేవి ప్రసాద్ జయమ్మ భర్తగా తన పాత్రను జస్టిఫై చేసి డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగ‌తా న‌టీన‌టులు కూడా వారి వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. 

47

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే... దర్శకుడు విజయ్‌కొత్త సినిమా అయినప్పటికీ  కథను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు. కామెడీ సీన్స్ తో పాటు విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అన్నీ కూడా  క్వాలిటీతో వచ్చేట్టు చూసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అన్ని క్యారెక్టర్స్ ని మెల్లగా ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత జయమ్మ క్యారెక్టర్ ని హైలైట్  చేశాడు దర్శకుడు సెకండాఫ్ కి వచ్చే వరకు కథను ఎమోషన్స్‌ వైపుకు మళ్లించాడు. 

57

అనుష్క కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మినిమమ్ బడ్జెట్‌తో తీసిన సినిమా అయినప్పటికీ రిచ్ అండ్ క్వాలిటీ విజువల్స్ ఇచ్చాడు. విలేజ్ సెటప్‌ని పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకుని సహజసిద్ధమైన వాతావరణాన్ని తన కెమెరా వర్క్ ద్వారా తెరపైకి తీసుకొచ్చాడు. ఎంఎం కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగాచెప్పేది ఏముంది  తనదైన ముద్ర వేశారు. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది.

67

ఇక పైనల్ గా జయమ్మ పంచాయితీ సినిమా గురించి చెప్పాలి అంటే..  మంచి టీమ్ నుంచి వచ్చిన ఒక పరిపూర్ణ గ్రామీన సినిమా.  ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను వారి పల్లెటూరి మూలాలకు తీసుకెళ్తుంది. సుమ ఆకట్టుకునే సహజమైన నటనతో జయమ్మను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.అయితే  సోగా సాగే కథ తో పాటు సింక్ లేని కొన్ని సన్నివేశాలు, సినిమా మొత్తం మీద టన్నింగ్ పాయింట్స్ లేకపోవడం కొంత మైనస్ అని చెప్పాలి. 
 

77

మరి చాలా గ్యాప్ తరువాత  ఎన్నో ఆశలతో సుమ కనకాల ఈ సినిమా చేశారు. ఒక సారి చూడగలిగే ఈసినిమాను సూపర్ హిట్ బాట పట్టిస్తారా...? లేక ప్లాప్ లిస్ట్ లో చేరుస్తారో అంతా ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. 
 

click me!

Recommended Stories