Samantha Vs Naga Chaitanya: సమంత Vs నాగ చైతన్య.. ఎప్పుడు.. ఎలానో తెలుసా ?

Published : May 06, 2022, 03:45 PM IST

బాక్సాఫీస్ వద్ద రసవత్తర సమరానికి రంగం సిద్ధం అయింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలో సమంత, నాగ చైతన్య నటించిన చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

PREV
16
Samantha Vs Naga Chaitanya: సమంత Vs నాగ చైతన్య.. ఎప్పుడు.. ఎలానో తెలుసా ?
Samantha

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు నాగ చైతన్య కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. 

 

26

చైతు, సమంత విడాకులు తీసుకోవడం ఫ్యాన్స్ కి మామూలు షాక్ కాదు. కొన్నిరోజుల పాటు ఈ వార్తని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం చై, సామ్ ఇద్దరూ వారి కెరీర్ లో బిజీగా మరి సినిమాలు చేసుకుంటున్నారు. సమంత, చైతు గురించిన న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అది త్వరలో జరగబోయే నిజం కూడా. 

 

36

బాక్సాఫీస్ వద్ద రసవత్తర సమరానికి రంగం సిద్ధం అయింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలో సమంత, నాగ చైతన్య నటించిన చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. సమంత నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

 

46

అలాగే నాగ చైతన్య నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో చైతు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ కానుంది. అమీర్ ఖాన్ మూవీ అంటే సందడి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నారు. 

 

56

చైతు, సమంత విడిపోయాక తొలిసారి ఇలా జరుగుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సమంత నటిస్తున్న యశోద చిత్రం థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. ఇటీవలే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక అమీర్ ఖాన్, చైతు నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం. 

 

66

అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో అద్వైత్ చందన్ అమీర్ తో సీక్రెట్ సూపర్ స్టార్ అనే మూవీ తెరకెక్కించారు. దీనితో లాస్ సింగ్ చద్దాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

click me!

Recommended Stories