పెళ్లి పీఠల మీదనే ఆగిపోయిన ఎన్టీఆర్‌ మ్యారేజ్‌.. స్టార్‌ హీరోయిన్‌ని మోసం చేయడం వెనుక ఉన్నదెవరు?

Published : Jun 24, 2025, 10:27 AM IST

ఎన్టీఆర్‌ బసవతారకం ఉండగానే మరో పెళ్లికి రెడీ అయ్యారు. అది కూడా స్టార్‌ హీరోయిన్‌తో కావడం విశేషం. మరి పెళ్లి పీఠల మీదనే మ్యారేజ్‌ ఎందుకు ఆగిపోయింది? 

PREV
15
తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ తెలుగు సినిమాకి ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన నటుల్లో ఒకరు. లెజెండరీ నటుడిగా రాణించారు. తెలుగు సినిమాకి రెండు కళ్లలో ఒకరిగా ఉన్నారు. మరో కన్నుగా ఏఎన్నార్‌ని పిలుస్తారనే విషయం తెలిసిందే. 

నటుడిగానే కాదు, రాజకీయంగానూ ఆయన సక్సెస్‌ అయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. తెలుగు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి బెస్ట్ సీఎం అనిపించుకున్నారు. 

కానీ ఆ తర్వాత తాను చేసిన కొన్ని తప్పులు, ఇతర నాయకులు చేసిన మోసం కారణంగా ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కుంగిపోయి కన్నుమూశారు.

25
బసవతారకం ఉండగానే హీరోయిన్‌తో ప్రేమతో రామారావు

ఎన్టీఆర్‌ తన జీవితంలో మరో కోణం ఉంది. అదే ప్రేమ. ఆయన సినిమాల్లోకి రాకముందే మరదలు బసవతారకంని పెళ్లి చేసుకున్నారు. వీరికి 12 మంది సంతానం కూడా. అయితే పిల్లలు పెద్దగైన తర్వాతనే ఎన్టీఆర్‌ ప్రేమలో పడ్డారు.

 ఆయన అప్పటి స్టార్‌ హీరోయిన్‌ కృష్ణకుమారితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. ఇంకా చెప్పాలంటే సావిత్రి వంటి హీరోయిన్ల కంటే కృష్ణకుమారితోనే ఆయన ఎక్కువగా సినిమాలు చేశారు.

 ఆ పరిచయం ఇద్దరి మనసులను దగ్గర చేసింది. పైగా ఎన్టీఆర్‌ మద్రాస్ లో ఉంటున్నారు. బసవతారకం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో ఆ గ్యాప్ ఉంది. అది ఎన్టీఆర్‌ని కృష్ణకుమారికి దగ్గర చేసింది.

35
హీరోయిన్‌ కృష్ణ కుమారితో రెండో పెళ్లికి రెడీ అయిన ఎన్టీఆర్‌

దీంతో ఏకంగా కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రామారావు. అంతేకాదు ఏకంగా రహస్యంగా పెళ్లికి రెడీ అయ్యారు. మరికొన్ని గంటల్లో మ్యారేజ్‌. అయితే ఈ విషయం రామారావు తన తమ్ముడు, నిర్మాత త్రివిక్రమరావుకి చెప్పాడు. 

ఈ విషయం తెలిసి షాక్‌ అయ్యారు తమ్ముడు. వామ్మో ఏదో జరుతుందని ఆయన అప్పటికప్పుడు ఊరు నుంచి బయలు దేరారు. ఆయన హుటాహుటిన మద్రాస్‌కి వెళ్లారు. వచ్చీ రావడంతోనే డైరెక్ట్‌గా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఆమెని బెదిరించాడట. 

45
కృష్ణకుమారిని తుపాకితో బెదిరించిన ఎన్టీఆర్‌ తమ్ముడు

ఎన్టీఆర్‌ని ఆంధ్ర దేశం అంతా రాముడిలా చూస్తారు. ఎంతగానో అభిమానిస్తారు. అలాంటిది ఆయన రెండో పెళ్లిచేసుకుంటున్నాడని తెలిస్తే షాక్‌ అవుతారు. ఎన్టీఆర్‌ పరువు మొత్తం పోతుందని చెప్పి ఆమెని బెదిరించాడట. 

తన వద్ద ఉన్న తుపాకీతో వార్నింగ్‌ ఇచ్చాడట. దీంతో ఆ దెబ్బకి చెన్నై వదిలి బెంగుళూరు వెళ్లిపోయిందట కృష్ణకుమారి. అలా తమ్ముడు త్రివిక్రమ రావు వల్ల ఎన్టీఆర్‌ రెండో పెళ్లి పీఠల మీదనే ఆగిపోయింది. 

ఇదంతా తన భార్య బసవతారకంకి తెలియకుండానే జరిగిందట. ఈ విషయాన్ని సీనియర్‌ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తంగా హీరోయిన్‌ కృష్ణకుమారి రామారావుని నమ్మి మోస పోయిందని చెప్పొచ్చు.

55
లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్‌

ఆ ఘటన తర్వాత కొన్నాళ్లపాటు మళ్లీ పెళ్లి అనే మాట ఎత్తలేదు రామారావు. కొన్నాళ్లకి భార్య బసవతారకమ్మ క్యాన్సర్‌ బారిన పడ్డారు. 1985లో ఆమె కన్నుమూసింది. ఆమె పేరుతోనే ఇండో అమెరికన్‌ కాన్సర్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 

ఇక భార్య మరణించే నాటికి రామారావు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సీఎంగా కూడా ఉన్నారు. కొంత కాలం ఒంటరిగానే ఉన్న ఆయన ఆ తర్వాత ప్రొఫేసర్‌ లక్ష్మి పార్వతికి ఆకర్షితుడయ్యాడు. ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎంట్రీతో రాజకీయంగా పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories