నన్ను ఎవరు ఆపలేరు, కాలర్ ఎగరేసిన జూనియర్ ఎన్టీఆర్, వార్ 2 ఈవెంట్ లో తారక్ స్పీచ్ వైరల్

Published : Aug 10, 2025, 10:58 PM ISTUpdated : Aug 10, 2025, 10:59 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ స్పీచ్  వైరల్ అవుతోంది.

PREV
15

ఎన్టీఆర్ మాట్లాడుతూ

“ఈ రోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండగ జరుపుకోవడానికి నన్ను బలవంతంగా ఒప్పించిన నాగవంశీకి థాంక్స్. 13 ఏళ్ల క్రితం బాద్‌షా ఈవెంట్‌లో వరంగల్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మరణించడం నన్ను చాలా బాధపెట్టింది. అందుకే ఆ తర్వాత నేను పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండిపోయాను,” అని అన్నారు. .

DID YOU KNOW ?
అభిమాని గురించి ఎన్టీఆర్
ఎన్టీఆర్ మొదటి సినిమా ఓపెనింగ్ నుంచి తనతో ఉన్న ఓ అభిమాని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. ముజీబ్ అనే ఫ్యాన్ మాత్రమే తనతో మొదటి సినిమా ప్రెస్ మీట్ నుంచి ఉన్నాడని ఆయన అన్నారు.
25

వార్ 2 చేయడానికి అసలైన కారణం

“ఈ సినిమా కథ కాదు, టెక్నికల్ టీం కాదు – దీనికి అసలైన కారణం ఆదిత్య చోప్రా గారు. ‘ఈ సినిమా నువ్వు చేయాలి. నీ అభిమానులు గర్వపడేలా తీయాలని నేను చూస్తా’ అని ఆయన చెప్పినప్పుడు నాకు పూర్తి భరోసా వచ్చింది,” అన్నట్టుగానే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుని, సినిమాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకోసం ఆదిత్య చోప్రా గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ అని ఎన్టీఆర్ తెలిపారు.

35

నిద్రలేని రాత్రులెన్నో

ఎన్టీఆర్ మాట్లాడుతూ, “నన్ను యాష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లోకి తీసుకున్నందుకు, ముంబయిలో కుటుంబంలా చూసుకున్నందుకు అక్కడి టీమ్‌కి నా ధన్యవాదాలు. బ్రహ్మాస్త్ర వేడుకకు నేను రాలేకపోయాను. అప్పుడు డైరెక్టర్ కూడా ఆ ఈవెంట్ కు రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ అయాన్ ముఖర్జీతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. రెండు స్టార్ హీరోలతో ఒకే సినిమాను తెరకెక్కించడం సాధారణ విషయం కాదు, మూవీని అద్భుతంగా తీయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు.” అని ఎన్టీఆర్ అన్నారు.

45

హృతిక్ డాన్స్ కు వీరాభిమానిని

హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ, “25 సంవత్సరాల క్రితం ‘కహో నా ప్యార్ హై’లో ఆయన డ్యాన్స్ చూసి నేనెంతో ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఇప్పుడు ఆయన పక్కన నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ అంటే అది హృతిక్. ఆయనతో డ్యాన్స్ చేయడం గొప్ప అనుభూతి,” ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో ‘హృతిక్‌ రోషన్‌’ ఒకరు. ఇది ఎన్టీఆర్‌ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్‌ చేస్తున్న తెలుగు మూవీ కూడా. అని ఎన్టీఆర్ అన్నారు.

55

తన అభిమాని గురించి జూనియర్ ఎన్టీఆర్

“25 సంవత్సరాల క్రితం ‘నిన్ను చూడాలని’తో నా ప్రయాణం మొదలైంది. రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 25 ఏళ్ల క్రితం ఆ సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మొదటిరోజు షూటింగ్‌కు మా నాన్న, అమ్మ మాత్రమే వచ్చారు. కానీ ఆ రోజున వచ్చిన అభిమాని మూజీబ్ ఇంకా నాతోనే ఉన్నాడు. ఇంతమంది అభిమానులు ఉండడం నా అదృష్టం. ఈ సినిమా ప్రతి ట్విస్ట్‌ను థియేటర్లోనే చూసేయండి. బయటకు పోనివ్వకండి. పెద్దాయన ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకూ నన్ను ఎవరు ఆపలేరు, డబుల్ కాలర్ ఎగరేస్తున్నా.. కుమ్మేద్దాం. మళ్లీ వార్ 2 సక్సెస్ మీట్ కు కలుద్దాం” అని అన్నారు ఎన్టీఆర్.

Read more Photos on
click me!

Recommended Stories