ఎవరు మీలో కోటీశ్వరుడు కోసం ఎన్టీఆర్ షాకింగ్ రెమ్యూనరేషన్.. రికార్డు సెట్ చేసిన యంగ్ టైగర్..!

First Published Mar 14, 2021, 7:52 AM IST

వేదిక ఏదైనా ఎన్టీఆర్ దిగాడంటే మోత మోగాల్సిందే. వెండితెరపై తిరుగు లేని హీరోగా ఉన్న ఎన్టీఆర్... నటనతో, డైలాగ్స్ తో, డాన్స్ లతో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మంచి వాక్ చాతుర్యం కలిగిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరో మరోమారు బుల్లితెరపై యుద్దానికి సిద్ధమయ్యారు.

మొట్టమొదటిసారి ఎన్టీఆర్ 2017లో బుల్లితెర హోస్ట్ గా మారారు. తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ షో మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ఆ షోకి ఎన్టీఆర్ తన ఫేమ్ మరియు టాలెంట్ తో సూపర్ పాప్యులారిటీ తెచ్చారు.
undefined
ఎన్టీఆర్ సారథ్యంలో బిగ్ బాస్ షో భారీ టీఆర్పీ దక్కించుకుంది. స్టార్ మా యాజమాన్యం అన్ని సీజన్స్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా ఫిక్స్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్నారు.
undefined
దాదాపు నాలుగేళ్ళ విరామం తరువాత ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నాడు ఎన్టీఆర్. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఈ షో త్వరలో మొదలుకానుంది.
undefined
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం ప్రోమోలో ఎన్టీఆర్ తన రాయల్ లుక్, మాటల మాయాజాలంతో కట్టిపడేశారు. ప్రోమోతోనే ఈ షోపై ఎన్టీఆర్ అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లారు.
undefined
ఇక్కడ కల మీది కథ మీది... ఆట నాది కోటి మీది... అనే అద్భుతమైన స్లోగన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మీరు డబ్బులు గెలుచుకున్నా లేకున్నా... జీవితంలో గెలిచే ఆత్మ స్థైర్యం మీకు ఖచ్చితంగా దొరుకుతుందని ఎన్టీఆర్ అంటున్నారు.
undefined
కాగా ఈ షో కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఏమిటీ? ఆయన ఎంత తీసుకుంటున్నారనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
undefined
ఎన్నడూ లేని విధంగా ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కోసం ఎన్టీఆర్ ఎపిసోడ్ కి కోటి తీసుకుంటున్నారట. ఈ సీజన్లో మొత్తం 30 ఎపిసోడ్స్ ఉండగా... ఎపిసోడ్ కి కోటి చొప్పున రూ. 30కోట్ల పారితోషికం అందుకుంటున్నారట.
undefined
ఎపిసోడ్ కి కోటి అంటే మాములు విషయం కాదు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ భారీగా ప్రచారం అవుతుంది. ఇక త్వరలో బుల్లితెరపై ఎన్టీఆర్ చేసే మాయాజాలం ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
undefined
click me!