కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీపై ఎన్టీఆర్ సైలెంట్.. అన్నదమ్ముల బంధంపై పుకార్లు పెట్టేశారుగా ?

Published : Dec 25, 2023, 11:26 AM ISTUpdated : Dec 25, 2023, 11:27 AM IST

డెవిల్ చిత్రం విషయంలో ఎన్టీఆర్ ఊసే వినిపించడం లేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు తారక్ పేరు చెప్పాడు. 

PREV
16
కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీపై ఎన్టీఆర్ సైలెంట్.. అన్నదమ్ముల బంధంపై పుకార్లు పెట్టేశారుగా ?

తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బింబిసార తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తో ఆమెకి రెండో చిత్రం.   

26

బింబిసార లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ జోరు పెంచారు.   కళ్యాణ్ రామ్ చిత్రాలపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.  ఆ క్రమంలో చివరగా విడుదలైన అమిగోస్ చిత్రం షాకిచ్చింది. అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టింది. ఈసారి నందమూరి హీరో బాక్సాఫీస్ ని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ 29న ఇయర్ ఎండ్ లో డెవిల్ అడుగుపెడుతున్నాడు. 

36

అయితే సలార్ ప్రభావమో, ప్రచార కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేకపోవడమో తెలియదు కానీ డెవిల్ చిత్రానికి ఆశించిన బజ్ అయితే లేదు. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే డెవిల్ చాలా పొటెన్షియల్ ఉన్న కథ అని తెలుస్తోంది. జనాల్లోకి బాగా తీసుకుని వెళితే మంచి ఓపెనింగ్స్ సాధించవచ్చు. ఆపైన భారం మొత్తం సినిమాకి వచ్చే టాక్ పై ఆధారపడి ఉంటుంది. 

46

బింబిసార చిత్రానికి ప్రచార కార్యక్రమాలు ఎన్టీఆర్ దగ్గరుండి చూసుకున్నారు. ఫలితంగా ఆ చిత్రానికి సూపర్ బజ్ క్రియేట్ అయింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా తారక్ హాజరు కావడం చూశాం. కానీ ఆ మూవీలో దమ్ము లేకవడం వల్ల డిజాస్టర్ అయింది. 

56

అయితే డెవిల్ చిత్రం విషయంలో ఎన్టీఆర్ ఊసే వినిపించడం లేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు తారక్ పేరు చెప్పాడు. డెవిల్ చిత్రం గురించి చిన్న ట్వీట్ కూడా ఎన్టీఆర్ వేయడం లేదు అనే చర్చ మొదలైంది. 

66

ఈ క్రమంలో కొందరు పుకారు రాయుళ్లు అన్నదమ్ముల మధ్య విభేదాలు అంటూ ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డెవిల్ చిత్రంపై మౌనంగా ఉండడానికి సరైన కారణాలు తెలియవు. అయితే కళ్యాణ్ రామ్, తారక్ మధ్య బంధం చెక్కు చెదరదని వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారని సన్నిహితుల నుంచి సమాచారం. 

click me!

Recommended Stories