BrahmaMudi Serial 25th December Episode:అరుణ్ ని కిడ్నాప్ చేసిన కనకం, స్వప్న సమస్యకు పరిష్కారం దొరికినట్లే..!

Published : Dec 25, 2023, 11:24 AM IST

ఇక తప్పదు అన్నట్లుగా రాజ్  కావ్య కి, విక్రమ్ పద్దూకి మెహందీ పెడతారు. వాళ్లు కర్మరా బాబు అనుకుంటూ మెహందీ పెడుతుంటే.. వీళ్లు మాత్రం మురిసిపోతూ ఉంటారు.

PREV
17
BrahmaMudi Serial 25th December Episode:అరుణ్ ని కిడ్నాప్ చేసిన కనకం, స్వప్న సమస్యకు పరిష్కారం దొరికినట్లే..!
Brahmamudi

BrahmaMudi Serial:దుగ్గిరాల కుటుంబసభ్యులంతా కలిసి కళ్యాణ్, అనామిక  పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతూ ఉంటారు. దానిలో భాగంగానే హల్దీ ఫంక్షన్  పూర్తౌతుంది. తర్వాత మెహందీ వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఓవైపు ఆడపిల్లలు మెహందీ కోసం ముస్తాబైతే.. మరోవైపు కళ్యాణ్ తండ్రి, విక్రమ్ తమ్ముడు ఆర్య అందరూ కలిసి తమ భార్యలకు తెలీకుండా మందు కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు.
 

27
Brahmamudi

మరోవైపు అప్పూ.. ఈ మెహందీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, అప్పూ రాలేదని కళ్యాణ్ ఫీలౌతాడు. దీంతో.. పద్మావతి రంగంలోకి దిగుతుంది. అప్పూ రాను అని చెప్పినా, వినిపించుకోకుండా.. అప్పూని కూడా మెహందీ వేడుకకు తీసుకువస్తుంది. అయితే, అప్పూ రావడం అనామికకు నచ్చదు. మరోవైపు ప్రతి ఒక్కరూ తమ భర్తల చేతే మెహందీ పెట్టించుకోవాలి అని చెబుతారు. 
 

37
Brahmamudi

అయితే, అది ఇష్టం లేని రాజ్, విక్రమ్ తప్పించుకుంటారు. కానీ,.. విక్రమ్ ని కావ్య.. రాజ్ వెంట పద్దూ పడి.. చివరకు మెహందీ ఫంక్షన్ కి వచ్చేలా చేస్తారు. ఇక తప్పదు అన్నట్లుగా రాజ్  కావ్య కి, విక్రమ్ పద్దూకి మెహందీ పెడతారు. వాళ్లు కర్మరా బాబు అనుకుంటూ మెహందీ పెడుతుంటే.. వీళ్లు మాత్రం మురిసిపోతూ ఉంటారు.
 

47
Brahmamudi

కళ్యాన్ అనామికకు మెహందీ పెట్టిన తర్వాత అప్పూకి కూడా పెడతాడు. పెట్టడమే కాదు.. అప్పూ మెహందీ బాగా వచ్చిందని అంటాడు. అంతే, ఆ మాట అనామికు మరింత కోపం తెప్పిస్తుంది. కానీ అది కళ్యాణ్ పట్టించుకోడు.

57
Brahmamudi

మరోవైపు అందరూ సంతోషంగా ఉన్నసమయంలో అరుణ్ ని పిలిస్తే రచ్చ అవుతుందని, పెళ్లి కూడా ఆగుతుందని మురళీ రాహుల్ వాళ్లకు చెబుతాడు. వెంటనే రాహుల్ సరేనని అంటాడు. వెంటనే అరుణ్ కి ఫోన్ చేస్తాడు. ఆల్రెడీ పెళ్లి జరుగుతున్న రిసార్ట్ కి వచ్చిన అరుణ్.. వాళ్లు చెప్పగానే అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి అందరికీ కనపడకుండా కేవలం స్వప్నకు మాత్రమే కనపడతాడు. అరుణ్ ని చూసిన వెంటనే కావ్య, పద్దూలకు చెప్పేస్తుంది.
 

67
Brahmamudi

కావ్య కి చెప్పేసిందనే భయంతో అరుణ్ పారిపోవాలని చూస్తాడు. కానీ, ఆలోగా పెళ్లికి వచ్చిన ఓ తాగుబాతు అరుణ్ ని పట్టుకుంటాడు. లైటర్ కావాలని అడుగుతాడు. తన దగ్గర లేదు అని అరుణ్ చెప్పడంతో.. వాడు చితకబాదుతాడు. వాడి  నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా,కావ్య పద్దూ వచ్చి అరుణ్ ని పట్టేసుకుంటారు. వాళ్ల నుంచి కూడా అరుణ్ తప్పించుకోవాలని చూస్తుంటాడు. అయితే, అదే సీన్ లోకి కనకం ఎంట్రీ ఇస్తుంది. అరుణ్ ని వెనక నుంచి కర్రతో తలపై ఒక్కటి కొడుతుంది. ఇంకేముంది వాడు పడిపోతాడు. తర్వాత వాడిని కట్టేసి.. అసలు వాడు అలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి అని కనకం చెబుతుంది.
 

77
Brahmamudi

రేపటి ఎపిసోడ్ లో అరుణ్.. తనతో ఇలాంటి ప్లాన్ వేయించింది ఎవరు అనేవిషయం చెప్పే అవకాశం ఉంది. పద్దూ, కావ్య కలిసి మాట ఇచ్చినట్లుగానే స్వప్న కాపురం లైన్ లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
 

click me!

Recommended Stories