ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి `ఆర్‌ఆర్ఆర్` చిత్రాన్నిరూపొందించిన విషయం తెలిసిందే. రెండు లెజెండరీ పాత్రలను తీసుకుని ఫిక్షనల్ కథాంశంతో అల్లూరి, కొమురంభీమ్ కలిసి స్నేహితులుగా బ్రిటీష్‌పై చేసిన పోరాటం నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం సాగనుంది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్ కథానాయికలుగా, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.