photo-i dream
మెగాస్టార్ చిరంజీవి చివరగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మూవీ `వాల్తేర్ వీరయ్య`. ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా ఇది నిలిచింది. ఇది రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇందులో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటించగా, రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి దర్శకుడు బాబీ(కేఎస్ రవీంద్ర). అభిమానిగా చిరంజీవిని ఎలా చూపించాలో ఆ రేంజ్‌లో చూపించి ఆయనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు బాబీ.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
photo-i dream
అసిస్టెంట్ డైరెక్టర్ గా, రైటర్‌గా చాలా ఏళ్లు పనిచేసిన బాబీ.. రవితేజతో `పవర్` సినిమాతో దర్శకుడిగా మారారు. ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు`. `సర్దార్ గబ్బర్ సింగ్`, `జై లవకుశ`, `వెంకీ మామ`, `వాల్తేర్ వీరయ్య` వంటి సినిమాలు తీశారు. `సర్దార్ గబ్బర్ సింగ్`, `వెంకీ మామ` అంతగా ఆడలేదు. మిగిలిన సినిమాలు పెద్ద హిట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు బాలకృష్ణతో `డాకు మహారాజ్` సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన టీనేజ్ లవ్ స్టోరీ బయటపెట్టాడు. క్రేజీ స్టోరీ చెప్పి ఆశ్చర్యపరిచారు.
photo-i dream
దాదాపు పదకొండేళ్లు సినిమాల్లో స్ట్రగుల్ పడినట్టు తెలిపాడు బాబీ. అయితే ఇండస్ట్రీలో తాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టు తెలిపారు. కథలు చెప్పడానికి వెళ్లినప్పుడు కొత్త షర్ట్ లేకపోవడంతో ఆఫర్లో వంద రూపాయలకు రెండు షర్ట్ కొనుక్కొని అవే చాలా ఏళ్లు మ్యానేజ్ చేశాడట. తినడానికి డబ్బులు ఉండేవి కాదని తెలిపారు. ఈ క్రమంలో ప్రేమించిన అమ్మాయి కోసం తాను ఇండస్ట్రీలోకి వచ్చాడట. అది చాలా విచిత్రంగా జరిగిందన్నారు. తాను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ 9వ తరగతి చదివే అమ్మాయిని ప్రేమించాడట. ఆమె కోసం తన బైక్ తీసుకుని వెళ్తుండేవాడట.
ఓ రోజు తనని కూడా తీసుకెళ్లారు. ఫ్రెండ్ లవర్‌తోపాటు మరో అమ్మాయి తోడు వచ్చిందట. ఆ ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి ఖాళీగా కనిపించేది. దీంతో ఆ అమ్మాయితో మాట్లాడటం స్టార్ట్ చేశాడట బాబీ. వాటర్ అడగడం, స్కూల్ ఎన్నిగంటలకు అయిపోతుంది, టీచర్ ఎలా ఉంటారు, క్లాస్లు ఎలా అవుతున్నాయని ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడేవాడట. అలా ఆ పరిచయం సీరియస్‌గా మాట్లాడుకునే స్థాయికి వెళ్లిందని, ఇలా రెండేళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారట.
ఓ రోజు అమ్మాయి మనం పెళ్లి చేసుకుందాం అని అడిగేసిందట. ఏదో చిన్నపిల్ల కదా అని లైట్ తీసుకున్నాడట. కానీ ఆమె మాటలు సీరియస్‌గా గుండెకి గుచ్చుకుంటున్నాయట. ఆమెని పెళ్లి చేసుకోవాలంటే మనం ఏదైనా చేయాలి, ఏం చేయాలనే కన్‌ప్యూజన్‌తో చదువు మానేసినట్టు తెలిపారు బాబీ. ఆ కన్‌ప్యూజన్‌లోనే హైదరాబాద్‌కి వచ్చినట్టు చెప్పాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలననిపించిందని, డైరెక్టర్ కావాలని బలంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దానికోసమే పదకొండేళ్లు స్ట్రగుల్ అయినట్టు తెలిపారు.