వైట్‌ షర్ట్ జీన్స్ లో ఎన్టీఆర్‌ మాస్‌ అవతార్‌.. `వార్‌ 2` కోసం మరోసారి ముంబాయిలో హల్‌చల్‌.. ఫోటోలు వైరల్‌

Published : Apr 21, 2024, 11:06 PM ISTUpdated : Apr 23, 2024, 01:00 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. `వార్‌ 2` సినిమా కోసం ముంబయికి వెళ్తున్నారు. గత వారంలో ముంబయిలో సందడి చేసిన ఆయన ఇప్పుడు మరోసారి హల్‌ చల్‌ చేశారు.   

PREV
16
వైట్‌ షర్ట్ జీన్స్ లో ఎన్టీఆర్‌ మాస్‌ అవతార్‌.. `వార్‌ 2` కోసం మరోసారి ముంబాయిలో హల్‌చల్‌.. ఫోటోలు వైరల్‌

ఎన్టీఆర్.. ప్రస్తుతం తెలుగులో `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్‌ సినిమాపై ఫోకస్‌ పెట్టారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

26

హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందుతున్న `వార్‌ 2`లో ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే చాలా రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. హృతిక్‌పై సీన్లు తీశారు. 
 

36

గత వారం నుంచి ఎన్టీఆర్‌ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గత వారం ఆయన `వార్‌2`లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముంబయిలో హల్‌చల్‌ చేశారు. అక్కడి సినిమా వాళ్లు ఎన్టీఆర్‌కి పార్టీ ఇచ్చారు. ప్రముఖ నటుడు అక్బర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్‌ సీఎం నువ్వే అన్నారు. ఆ వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. 
 

46

ఇప్పుడు మరోసారి ముంబాయి వెళ్లారు ఎన్టీఆర్‌. ఆదివారం ఆయన ముంబయికి బయలు దేరారు. `వార్‌ 2` షూటింగ్‌ కోసం మరోసారి ఆయన ముంబయికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. ఇందులో ఆయన లుక్‌ వైరల్‌ అయ్యింది. 
 

56

వైట్‌ షర్ట్, జీన్స్ లో మెరిశారు ఎన్టీఆర్. మాస్‌ లుక్‌లో అదిరిపోయేలా ఉన్నారు. గెడ్డం ట్రిమ్‌ చేసి, షార్ట్ కటింగ్‌తో ఆర్మీ ఆఫీసర్‌ తరహాలో కనిపిస్తున్నారు. `వార్‌ 2` గెటప్‌ళో అదరగొడుతున్నారు. అంతేకాదు ముంబయిలో ఆయన వాకింగ్‌ స్టయిల్‌, మాస్‌ అవతార్‌లో అదరగొట్టేలా ఉంది.
 

66

 ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కంటిన్యూగా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుందట. మరో వారం ఆయన అక్కడే షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories