ఇంటివాడైన యంగ్‌ హీరో తిరువీర్‌.. గ్రాండ్‌గా వెడ్డింగ్‌.. ఫోటోలు వైరల్‌..

Published : Apr 21, 2024, 08:48 PM ISTUpdated : Apr 21, 2024, 08:49 PM IST

`మసూద` చిత్రంతో బ్రేక్‌ అందుకుని హీరోగా బిజీ అవుతున్న యంగ్‌ హీరో తిరువీర్‌ మ్యారేజ్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టాడు. తాజాగా ఆదివారం ఆయన మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగింది.   

PREV
15
ఇంటివాడైన యంగ్‌ హీరో తిరువీర్‌.. గ్రాండ్‌గా వెడ్డింగ్‌.. ఫోటోలు వైరల్‌..

యంగ్‌ హీరో తిరువీర్‌ ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. కల్పన రావుతో ఆయన వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు ప్రస్తుతం వీరి మ్యారేజ్‌ ఫోటోలను తిరువీర్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

25

హీరో తిరువీర్ పంచుకున్న ఫోటోల్లో మెహందీ పిక్స్, మ్యారేజ్‌ పిక్స్ ఉన్నాయి. ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. దీంతో అభిమానులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబుతున్నారు. 
 

35

తిరువీర్‌.. ఎంతో స్ట్రగుల్‌ పడుతూ హీరోగా ఎదిగాడు. థియేటర్‌ ఆర్టిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించాడు. థియేటర్‌ యాక్టర్‌గా అనేక నాటకాలు ప్రదర్శించారు. అలాగే కొన్నింటికి దర్శకత్వం వహించారు.
 

45

2016లో నటుడిగా తెరంగేట్రం చేశారు. `బొమ్మలరామారం` చిత్రంలో చిన్న పాత్రలో మెరిశాడు. ఆ తర్వాత `ఘాజీ`, `ఏ మంత్రం వేశావె`, `సుభలేఖలు`, `మల్లేశం`, `జార్జ్ రెడ్డి` చిత్రాల్లో నటిస్తూ నటుడిగా ఎదుగుతూ వస్తున్నారు. 
 

55

`పలాస1978`లో సెకండ్‌ హీరోగా మెప్పించాడు. దీంతోపాటు `టక్‌ జగదీష్‌`లోనూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో `మసూద` మూవీ ఆయనకు హీరోగా బ్రేక్‌ ఇచ్చింది. దీంతో హీరోగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆ మధ్య `పరేషాన్‌` అనే కామెడీ మూవీతో అలరించారు. ఇప్పుడు `పారాహుషారు`, `మోక్షపఠం`తోపాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు తిరువీర్‌. ఈ క్రమంలో ఆయన పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories