NTR to Mahesh: ఎన్టీఆర్, మహేష్, విజయశాంతి చేసిన తప్పులు.. బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమాలు ఏమయ్యాయో తెలుసా ?

Published : Nov 24, 2026, 11:04 AM IST

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని వందల సినిమాలకు మాటలు, కథలు అందించారు. ఇటీవల ఆయన తెలుగు సినిమాలకు తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్, విజయశాంతి సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
15
Mahesh Babu

సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన మల్లీశ్వరి, విజయశాంతి నటించిన ఆశయం చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావలసినవి. కానీ కమర్షియల్ గా ఆడలేదు. సినిమా పరంగా మాత్రం కల్ట్ సినిమాలు అనే గుర్తింపు దక్కింది. ఆ చిత్రాలు కమర్షియల్ గా ఆడకపోవడానికి గల కారణాలని పరుచూరి వివరించారు.

25
మల్లీశ్వరి మూవీ

తెలుగు సినిమా చరిత్రలో మల్లీశ్వరి మూవీ ఒక క్లాసిక్. అందులో ఎలాంటి సందేహం లేదు. సినిమా పరంగా ఇప్పుడున్న చాలా మంది దర్శకులకు, అభిమానులు, సెలెబ్రెటీలకు ఈ చిత్రం ఫేవరెట్ మూవీ. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రం గుర్తింపు పొందింది. ఎన్టీఆర్, భానుమతి లాంటి లెజెండ్రీ నటులు ఈ చిత్రంలో నటించారు. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం నిరాశ పరిచింది. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ పాతాళ భైరవి అని పరుచూరి తెలిపారు. పాతాళ భైరవి ముందుగా విడుదలై ఎన్టీఆర్ కి తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకువచ్చింది. కొన్ని నెలల తర్వాత విడుదలైన మల్లీశ్వరి అంచనాలని అందుకోలేకపోయింది. పాతాళభైరవిలో అంతటి భయంకర మాంత్రికుడిని అంత చేసిన మాస్ హీరోగా ఎన్టీఆర్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దానికి భిన్నంగా పూర్తి క్లాస్ టచ్ తో వచ్చిన మల్లీశ్వరితో అభిమానులు సంతృప్తి చెందలేదు. దీనితో కలెక్షన్స్ రాలేదు. కానీ పలు అందర్జాతీయ స్టేజీలపై ఈ చిత్రానికి క్లాసిక్ అనే గుర్తింపు లభించింది. మల్లీశ్వరి కనుక ముందుగా విడుదలై, ఆ తర్వాత పాతాళ భైరవి వచ్చి ఉంటే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యేవి అని పరుచూరి తెలిపారు.

35
ఆశయం

మల్లీశ్వరి తరహా పరిస్థితే విజయశాంతి ఆశయం చిత్రానికి కూడా ఎదురైంది. విజయశాంతి నటించిన కర్తవ్యం మూవీ ఆమెకి మాస్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆశయం చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దానికి కారణం కర్తవ్యంలో విజయశాంతికి దక్కిన ఇమేజ్ ని ఆశయంతో మ్యాచ్ చేయలేకపోవడమే అని పరుచూరి తెలిపారు.

45
అతడు

ఇలాంటి పరిస్థితే మహేష్ బాబు అతడు సినిమాకు ఎదురైంది. కానీ దీని పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎన్టీఆర్, విజయశాంతి విషయంలో వారి మాస్ సినిమాలు ముందుగా రిలీజ్ అయ్యాయి. దాని వల్ల ఆ తర్వాత వచ్చిన క్లాస్ మూవీస్ పై ప్రభావం పడింది. కానీ మహేష్ బాబు అతడు మూవీ క్లాస్ టచ్ తో ఉన్న యాక్షన్ మూవీ. కొన్ని కారణాల వాళ్ళ ఈ చిత్రం కమర్షియల్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ పోకిరి రిలీజ్ అయ్యాక కనుక అతడు వచ్చి ఉంటే ఆ చిత్రం నెక్స్ట్ లెవల్ కి వెళ్ళేది అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

55
క్లాస్ సినిమాల విషయంలో మాస్ హీరోలు జాగ్రత్తగా ఉండాలి

మాస్ హీరోలు క్లాస్ సినిమాలు చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చేయాలి అని పరుచూరి అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే మాస్ ఇమేజ్ ఉన్న హీరో డీలా పడిపోయే పాత్రలో కనిపిస్తే ఆడియన్స్ కి నచ్చదు. చాలా మంది అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి మూవీ చేసి ఉంటే ఎలా ఉండేది అని అడిగారు. అల్లు అర్జున్ కి ఆ సినిమా సెట్ కాదు. అర్జున్ రెడ్డిలో మాస్ అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ అవి బన్నీ స్టార్ డమ్ కి సెట్ కావు. అది విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి మాత్రమే సెట్ అయ్యే మూవీని పరుచూరి తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories