Dimple Hayathi: శర్వానంద్‌తో డింపుల్‌ వీడియో దుమారం, పెళ్లిపై హీరోయిన్‌

Published : Nov 24, 2026, 08:48 AM IST

హీరోయిన్‌ డింపుల్‌ హయతి.. శర్వానంద్‌తో క్లోజ్‌గా మూవ్ అయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో తన పెళ్లిపై డింపుల్‌ హయతి క్లారిటీ ఇచ్చింది. నెటిజన్‌కి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది.

PREV
13
డింపుల్‌, శర్వానంద్‌ వీడియో వైరల్‌

హీరోయిన్‌ డింపుల్‌ హయతి అడపాదడపా సినిమా చేస్తూ రాణిస్తోంది. గల్ఫ్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె రవితేజ `ఖిలాడీ` మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రవితేజతోనే `భర్త మహాశయులకు విజ్ఞప్తి`లో మెరిసింది. ఇలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తున్న డింపుల్‌ ఇప్పుడు శర్వానంద్‌తో `భోగి` చిత్రంలో నటిస్తోంది. ఇందులో శర్వానంద్‌ హీరో, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న డింపుల్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శర్వానంద్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయిన ఒక వీడియో వైరల్‌ అయ్యింది. ఇందులో డింపుల్‌, శర్వానంద్‌ మధ్య సైలెంట్‌ కన్వర్జేషన్స్, ఎక్స్ ప్రెషన్స్, క్లోజ్‌నెస్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

23
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన డింపుల్‌ హయతి

ఈ వీడియో సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు ప్రారంభమయ్యాయి. అయితే శర్వానంద్‌కి పెళ్లి అయ్యింది. ఈ క్రమంలో డింపుల్‌కి కూడా మ్యారేజ్‌ అయ్యిందనే చర్చ ప్రారంభమైంది. ఆ వీడియోకి కింద ఒక నెటిజన్‌ స్పందిస్తూ, శర్వానంద్‌తోపాటు డింపుల్‌కి కూడా మ్యారేజ్‌ అయ్యింది కదా అని కామెంట్‌ చేశారు. దీనికి డింపుల్‌ స్పందించింది. తనకు ఇంకా మ్యారేజ్‌ కాలేదని స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు తాను సింగిల్‌ అనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. అదే సమయంలో రూమర్లకి బలాన్నిచ్చిందని అంటున్నారు. మొత్తంగా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. నిజంగానే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారా? లేక ప్రమోషన్స్ కోసం, కంటెంట్‌ ఇవ్వడం కోసం అలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.

33
డింపుల్‌ హయతి చుట్టూ వివాదాలు

ఇదిలా ఉంటే ఆ మధ్య డింపుల్‌కి సంబంధించిన ఒక వివాదం బయటకు వచ్చింది. ఆమె హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్‌లో ఉంటుందని, మరో వ్యక్తితో ఉంటుందని ఒరిస్సాకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేశారు. ఆమె వద్ద తాము పనిచేశామని, సడెన్‌గా పంపించేసిందని, డబ్బులు కూడా ఇవ్వలేదని, కనీసం ఫుడ్‌ కూడా పెట్టలేదంటూ ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్‌ వద్ద నిరసన తెలియజేశారు. అప్పట్లో ఇది హాట్‌ టాపిక్‌ అయ్యింది. అలాగే మరోసారి డింపుల్‌ అపార్ట్ మెంట్‌ పార్కింగ్‌ విషయంలో ఓ పోలీస్‌ అధికారితోనూ గొడవ చేసిందనేది బయటకు వచ్చింది. ఇలా ఆమెని పలు వివాదాలు వెంటాడాయి. ఇప్పుడు కొత్తగా ఈ వీడియో మరింత రచ్చ లేపుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories