Natraj Master: పెళ్లైన లేడీని పట్టుకొని ఆ రౌడీ అంత మాట అనొచ్చా.. పూరీ, అలీ మీరు చేసేది కరెక్ట్ కాదు

Published : Nov 24, 2026, 09:57 AM IST

Natraj Master: నీతూ మాస్టర్‌ ఎలిమినేషన్‌పై, బిగ్‌ బాస్‌ షోపై నటరాజ్‌ మాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ సినిమాల్లో రౌడీ మాత్రమే కాదు, హౌజ్‌లో కూడా రౌడీనే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

PREV
14
నీతూ మాస్టర్‌ ది అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10.. 11 వ వారం నుంచి నీతూ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె మీడియతో ముచ్చటించింది. తన భర్త నటరాజ్‌ మాస్టర్‌ కూడా తనతో ఉన్నారు. ఇందులోనే నీతూ మాస్టర్‌ బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు. ఈ సందర్భంగా నీతూ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ తన ఎలిమినేషన్‌ కరెక్ట్ కాదని, అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అని వెల్లడించారు. తమకు ఓటింగ్ బాగానే ఉందని, కానీ ఎలిమినేట్‌ ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌, నాగార్జున చేస్తున్న కరెక్ట్ నా అనేది ఒకసారి చెక్‌ చేసుకోవాలని తెలిపారు.

24
వంశీ పెద్ద రౌడీ.. పెళ్లైన లేడీ అలా అనొచ్చా

ఇందులోనే నటరాజ్‌ మాస్టర్‌ మాట్లాడుతూ, హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌ వంశీపై ఫైర్‌ అయ్యాడు. ఆయన బయట రౌడీనే, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కూడా రౌడీనే అంటూ మండిపడ్డాడు. ఒక పెళ్లైన లేడీ(నీతూ మాస్టర్‌)ని పట్టుకొని పులిహోర కలుపుతుంది, మసాజ్‌లు చేస్తుందంటూ నీచంగా మాట్లాడాడు. అంతేకాదు కులకడాలు, పిసకడాలు అంటూ బూతులు మాట్లాడాడు. ల పదంతో, నీ అమ్మ అనే పదాలు కూడా వాడాడు. వాడు ఒక కంటెస్టెంటా. ఇలాంటిపదాలతో ఈ షో ద్వారా జనాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ నటరాజ్‌ మాస్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హౌజ్‌లో మొత్తం అలయెన్స్ లు పెట్టుకొని సర్వైవ్‌ అవుతున్నారు, ఇన్ని సీజన్లలో ఇలాంటి వరస్ట్ గేమ్‌ని, టాక్సిక్‌ గేమ్‌ని ఎప్పుడూ చూడలేదు. మొత్తంగా టాక్సిక్‌ నడుస్తోందంటూ మండి పడ్డాడు నటరాజ్‌ మాస్టర్‌. హౌజ్‌లోకి వచ్చి అలీ గారు ఆ రౌడీకి సపోర్ట్ చేశాడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కూడా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఓట్లు వేస్తున్నాడట. సార్‌ మీకు చెప్పేది ఒక్కటే దయజేసి మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్‌ కాదు, యాప్‌లు డిలీట్‌ చేయండి అని తెలిపారు నటరాజ్‌ మాస్టర్‌.

34
ఓటింగ్ అంతా ఫేక్‌, త్రిగుణ్‌ చెప్పినట్టే జరుగుతుంది

ఆయన ఇంకా మాట్లాడుతూ, తాము మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ షోలో పాల్గొన్నప్పుడు తమకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఆడియెన్స్ బాగా ఎంకరేజ్‌ చేశారని, తమ ప్రేమని చూపించారని, అదే బిగ్‌ బాస్‌ షోకి వెళితే అది ఇంకా ఎక్కువగా ఉంటుందని భావించి నీతూని హౌజ్‌లోకి పంపించాను. అయితే షోని చూసి, కంటెస్టెంట్లు గొడవలను చూసి జనాలు ఎంటర్‌టైన్‌ అవుతున్నారు గానీ, ఓట్లు వేయడం లేదు. ఓట్ల గేమ్ వేరే ఉంది. దాన్ని ప్రైవేట్‌ పీఆర్‌ టీమ్‌లు నిర్వహిస్తున్నాయి.

ఇతర కంటెస్టెంట్ల గురించి నెగటివ్‌గా పోస్టులు పెట్టించి జనాలను ప్రభావితం చేస్తున్నారు. ఆడియెన్స్ ఎలా ఆలోచించాలో కూడా వాళ్లే చెబుతున్నారు. దొంగ పీఆర్‌లు, దొంగ నా కొడుకులు ఇదంతా తప్పుగా పోట్రే చేస్తున్నారు. కంటెస్టెంట్లకి ఓట్లకి సంబంధించిన పోలింగ్‌ అంతా ఫేక్‌, వాళ్లంతా పెయిడ్‌ బ్యాచ్‌ చేసే పని, వాళ్లు ఎవరికి ఓట్లు వేయాలో, ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ కావాలో డిసైడ్‌ చేస్తున్నారు. లోపల త్రిగుణ్‌ ఆడిస్తున్నాడు, బయట ఈ పీఆర్‌లు ఆడిస్తున్నారు. త్రిగుణ్‌ చెప్పినట్టుగానే చేస్తున్నారు. ఈ పీఆర్‌ లు ఎంత దారుణంగా ఉన్నారంటే, నా కూతురిపై కూడా అసభ్యకరంగా కామెంట్లు పెట్టారు` అని ఆవేదన వ్యక్తం చేశారు.

త్రిగుణ్‌, బిగ్‌ బాస్‌ కుమ్మక్కయ్యారా అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, ప్రోటోకాల్‌ తాను దీనిపై కామెంట్‌ చేయలేనని తెలిపారు. పరోక్షంగా అదే నిజం అనేలా ఆయన రియాక్ట్ కావడం గమనార్హం. అయితే ఇదంతా జరుగుతున్నా, హోస్ట్ నాగార్జున గారు ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావడం లేదు, ఆయన చూస్తున్నారా లేదా తెలియడం లేదన్నారు.

44
నటరాజ్‌ మాస్టర్‌ కోసమే బిగ్‌ బాస్‌ కి వెళ్లాను- నీతూ మాస్టర్‌

నీతూ మాస్టర్‌ చెబుతూ, నటరాజ్‌ మాస్టర్‌ అంతకు ముందు వెళ్లినప్పుడు టాప్‌ 5 లోకి వెళ్లలేదు. తానేంటో నిరూపించుకోలేకపోయారు. ఆయన కోసం ఈ షోకి వెళ్లానని, టాప్‌ 5లో ఉండాలని భావించానని, కానీ ఇలా సడెన‌‌గా ఎలిమినేట్‌ అవుతానని అనుకోలేదని చెప్పాడు నీతూ మాస్టర్‌. రోహిత్‌ గురించి వాళ్ల అమ్మ, అక్క ఆవేదన వ్యక్తం చేయడంతో ఆ విషయం మాత్రమే హౌజ్‌లో చెప్పానని, కానీ దాన్ని నెగటివ్‌ గా పోట్రే చేశారని తెలిపారు. ఆట పరంగా తాను బాగా ఇచ్చానని, బూతులు తిట్టినా ప్రొటెస్ట్ చేశానని, కానీ వ్యక్తిగతంగా కామెంట్ చేయడంతో తట్టుకోలేకపోయానని, వాళ్లని కొట్టాలనేంత కోపం వచ్చిందని, కానీ అక్కడ ఆ పని చేయలేం కదా అని, నన్ను నేను కొట్టుకున్నాను, ఆ బాధని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది అని తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories