రజినీకాంత్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. తమిళ పరిశ్రమ మాత్రమే కాదు.. ఆయన ప్రపంచం మెచ్చన నటుడు. అన్ని భాషల్లో కోట్లాది మంది ఫ్యాన్స్ కలిగి ఉన్న హీరో. సామాన్యుడు సెలబ్రిటీ అయితే ఇలానే ఉంటుంది అనడానికి బెస్ట్ ఎక్సాంపుల్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. తమిళ తలైవా గురించి ఎన్ని రోజులైనా చెప్పవచ్చు.
Rajinikanth
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే లైన్ కు బెస్ట్ ఉదాహరణ రజినీకాంత్. సాధారణ బస్ కంటెక్టర్ గా జీవితాన్ని స్టార్ట్ చేసి.. స్నేహితుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలే మహారాజు అయ్యాడు. ఎక్కడా సిటీబస్ లో టికెట్లు కొట్టుకునే అతను ధైర్యం చేసి ముందడుగు వేస్తే.. కోట్లాదిమంది గుండెళ్లో గుడికట్టి పూజించే దేవుడయ్యాడు.
దాదాపు 45 ఏళ్లకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కోనసాగుతూ.. అభిమానులను అలరిస్తున్నాడు రజినీకాంత్. అయితే రజినీకాంత్ ఈ స్థాయిని అంత ఈజీగా అందుకోలేదు. ఎన్నో ఎత్తు పల్లాలు.. మరెన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. అంచలంచలుగా ఈ స్థాయిని చేరారు సూపర్ స్టార్.
70 ఏళ్ళు దాటినా.. కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నాడురజినీకాంత్. ఇండస్ట్రీలో ఆయనో శిఖరం. అయితే రజినీకాంత్ హీరో అవ్వడానికి ఓ వ్యక్తి తన మెడలో బంగారు గొలుసు తీసి అలా తన చేతుల్లో పెట్టాడట. ఇంతకీ అతను ఎవరో కాదు రజినీకాంత్ కండెక్టర్ గా పనిచేసిన బస్ కు డ్రైవర్.. తన స్నేహితుడు బహదూర్.
అవును రజినీకాంత్ బెంగళూరు సిటీ బస్ లో కండెక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లో.. చాలాస్టైలీష్ గా ఉండేవారట. అందరిని తన స్టైల్ తో మెస్మరేజ్ చేసేవారట. దాంతో తన తోటి స్నేహితులు, ఆర్టీసీ ఉద్యోగులు అంతా.. నువ్వు చాలా బాగున్నావు.. స్టైలీష్ గా ఉన్నావు. .మద్రస్ వెల్ళి సినిమాల్లో ట్రై చేయి అన్నారట.
రజినీకాంత్ కు సలహా అయితే ఇచ్చారు కాని.. ఎవరు రజినికాంత్ కు ఆర్ధికంగా సహాయం చేయలేదట. కాని ఒక్క స్నేహితుడు మాత్రం రజినీకాంత్ ను నమ్మ.. ఆయనకు ఆర్ధికంగా సహాయం చేశారట. ఆయన ఎవరో కాదు బహదూర్.
అవును రజినీకాంత్ టికెట్లు కొట్టే బస్ కు డ్రైవర అతను. నువ్వు నిజంగా స్టార్ వి అవుతావు.. అంటూ.. తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి ఇచ్చి.. మద్రాస్ వెళ్ళు అని ప్రోత్సహించారట.
రజినీకాంత్ స్టైల్.. హీరోయిజం చూసి.. సినిమాల్లోకి వెళ్ళమని సలహా ఇవ్వడంతో పాటు.. వెన్నుతట్టి ప్రోత్సహించింది అతనే. రజినీకాంత్ మద్రాస్ లో సినిమాప్రయత్నాలు చేస్తున్నప్పుడు, యాక్టింగ్ లో ట్రైయినింగ్ తీసుకుంటున్నప్పుడు కూడా రాజ్ బహదూర్ తన జీతంలో కొంత భాగం రజినీకాంత్ ఖర్చుల కోసం పంపించేవార.
రజినీకాంత్ ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. నిరాశపడకుండా.. ధైర్యం చెపుతూ... తలైవా ఇంతలా ఎదగడానికి కారకుడయ్యాడు రాజ్. రజినీకాంత్ ఎంత ఎదిగినా.. రాజ్ మాత్రం తన జాబ్ ను చేస్తూ.. రిటైర్ అయ్యాడు కాని.. మధ్యలో వదిలేయలేదు. అంతే కాదు తలైవా నుంచి ఏమాత్రం సహాయం కాని.. డబ్బు కాని తీసకోకుండా.. స్వచ్చమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు రాజ్ బహదూర్.
రజినీకాంత్ కు ఆయన మాట వేదం. ఆయన చెపితే.. నో అనకుండా చేసేస్తాడట. అయితే రజినీకాంత్ తన స్నేహితుడినికలవడానికి ఏడాదికి ఒక్కసారి అయినా బెంగళూరు వెళ్తారట.. లేదంటా తన ఫ్రెండ్ ఫ్యామిలీతో సహా చెన్నైకి రమ్మంటారట. రజినీ బెంగళూరు వెళ్తే మత్రం తన స్నేహితుడితో కలిసి.. హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారట. గతంలో తమ మీటింగ్ స్పాట్ కూర్చుని గతం నెమరు వేయడం.. రాజ్ ఇంట్లో తమ గదిలో కూర్చుని.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం ఎంతో ఇష్టమట రజినీకాంత్ కు.