ఎన్టీఆర్ vs రామ్ చరణ్: ఆస్తుల్లో తారక్‌కి ఝలక్‌ ఇస్తున్న చరణ్‌.. హిట్లలో ఎవరు టాప్‌?

Published : May 20, 2025, 11:20 AM IST

టాలీవుడ్‌ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ 42 ఏళ్ళకి వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఆయనతో పోటీలో ఉన్న రామ్ చరణ్ సినిమాలు, రికార్డ్స్, ఆస్తుల గురించి చూద్దాం. 

PREV
18
ఎన్టీఆర్‌ సీనియర్‌, చరణ్‌ జూనియర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ చూస్తే, ఎన్టీఆర్ సీనియర్. ఎన్టీఆర్ 2001లో హీరోగా ఎంట్రీ ఇస్తే, చరణ్ 2007లో  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తారక్‌ వచ్చిన ఆరేళ్ల తర్వాత చరణ్‌ రావడం గమనార్హం. 

28
ఎన్టీఆర్‌ 30 సినిమాలు, చరణ్‌ 15 సినిమాలు

చరణ్ ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించారు, ఎన్టీఆర్ 30 సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరి ఇమేజ్‌ సేమ్‌ గా ఉండటం విశేషం. 

38
30 సినిమాలో 13 హిట్లు

ఎన్టీఆర్ నటించిన 30 సినిమాల్లో చాలా హిట్లే. `స్టూడెంట్ నెం 1`, `సింహాద్రి`, `ఆది`,   `యమదొంగ`, `బృందావనం`, `అదుర్స్`, `టెంపర్‌`, `జనతా గ్యారేజ్`, `నాన్నకు ప్రేమతో`, `జైలవకుశ`, `అరవింద సమేత`, `RRR`, `దేవర` వంటి చిత్రాలు విజయాలు అందుకున్నాయి.  

48
తారక్‌, చరణ్‌లకు కోట్లల్లో ఆస్తులు

రామ్‌ చరణ్‌ 15 సినిమాలు చేస్తే అందులో ఆరు విజయాలు సాధించాయి. బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్, చరణ్ కన్నా ముందున్నారు. ఎన్టీఆర్ సినిమాలు చాలావరకు హిట్టయ్యాయి. ఇద్దరూ కోట్లకు అధిపతులే. 

58
ఎన్టీఆర్‌ ఆస్తులు 500కోట్లు, చరణ్‌ ఆస్తులు 1370 కోట్లు

రిపోర్ట్స్ ప్రకారం ఎన్టీఆర్ దగ్గర రూ.500 కోట్ల ఆస్తి ఉందని సమాచారం. చరణ్ దగ్గర 1370 కోట్లు ఉన్నాయని అంటుంటారు. ఆస్తుల పరంగా చరణ్ ముందున్నారు. అయితే చరణ్‌కి తండ్రి మెగాస్టార్‌ నుంచి బాగానే వస్తాయి. కానీ తారక్‌ వారసత్వంగా పొందింది తక్కువే, ఆయన సొంతంగా సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. 

68
`జంజీర్‌`తో చరణ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ.. `వార్‌ 2`తో తారక్‌ ఎంట్రీ

రామ్ చరణ్ 'జంజీర్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా సినిమా ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ 'వార్ 2'తో బాలీవుడ్‌లోకి వస్తున్నారు. ఈ మూవీ ఈ ఆగస్ట్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి సక్సెస్‌ కొడతాడా? స్నేహితుడు చరణ్‌ కి ఎదురైన అనుభవాన్నే ఫేస్‌ చేస్తాడా అనేది చూడాలి. 

78
`ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియాస్టార్స్ అయిన తారక్‌, చరణ్‌

2022లో వచ్చిన రాజమౌళి RRRలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ నటించారు. 550 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా 1387 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీతో ఇద్దరూ పాన్‌ ఇండియాస్టార్స్ అయ్యారు. 

88
`పెద్ది`తో చరణ్‌, `వార్‌ 2` `డ్రాగన్‌`లతో ఎన్టీఆర్‌ బిజీ

చరణ్ ఇప్పుడు `పెద్ది' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ 'వార్ 2'తో పాటు ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో నటిస్తున్నారు.  `వార్‌ 2` ఆగస్ట్ లో రిలీజ్‌ కాబోతుండగా, ప్రశాంత్‌ నీల్‌ మూవీ వచ్చే ఏడాది రానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories