ఎన్టీఆర్ కి భయపడుతున్న మోక్షజ్ఞ? బాలయ్య బలవంతం చేస్తున్నా అందుకే వెనకడుగు!

Published : May 22, 2024, 09:30 PM IST

మోక్షజ్ఞ హీరో ఎందుకు కావడం లేదు. అందుకు ఓ బలమైన కారణం ఉందట. మోక్షజ్ఞ అన్నయ్య ఎన్టీఆర్ కి భయపడుతున్నాడట. ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.   

PREV
15
ఎన్టీఆర్ కి భయపడుతున్న మోక్షజ్ఞ? బాలయ్య బలవంతం చేస్తున్నా అందుకే వెనకడుగు!

చిత్ర పరిశ్రమలో వారసత్వం బలమైన సెంటిమెంట్. ఓ స్టార్ హీరో కొడుకు హీరో అవ్వాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు. నందమూరి అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ హీరో కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

25

రెండు పదుల వయసు దాటగానే వారసులు హీరోలు కావడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే టీనేజ్ లోనే హీరో అయ్యాడు. మీసం మొలవక ముందే మాస్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ సక్సెస్ అయిన తీరు అద్భుతం. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్ ఆయన్ని స్టార్ చేసింది. 

 

35

రామారావు తర్వాత ఆ ఫ్యామిలీలో సక్సెస్ అయిన హీరోలు బాలయ్య, ఎన్టీఆర్ మాత్రమే. కళ్యాణ్ రామ్ పడుతూలేస్తూ కెరీర్ సాగిస్తున్నాడు. తారక రత్న స్టార్ అవుతాడు అనుకుంటే ఆయన ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దేశంలోనే గొప్ప డాన్సర్ ఎన్టీఆర్. ఆయన స్పీడ్ అందుకోవడం ఎవరికైనా కష్టం. 

 

45

మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్న మోక్షజ్ఞ హీరో కాకపోవడానికి ఎన్టీఆర్ నే కారణమట. అన్న ఎన్టీఆర్ ఎదిగిన తీరు మోక్షజ్ఞను భయపెడుతుంది అట. హీరో అయితే ఎన్టీఆర్ రేంజ్ కి వెళ్ళాలి. కనీసం ఆయన దరిదాపుల్లోకి రావాలి. అది అసాధ్యం అని మోక్షజ్ఞ భావన అట. ఎన్టీఆర్ మాదిరి సక్సెస్ కాకపోతే అది బాలయ్యకు చెడ్డ పేరు తెస్తుంది. తనకు కూడా అవమానకర పరిణామం. 


 

55

అందుకే మోక్షజ్ఞ హీరో కావాలంటే భయపడుతున్నారట. అయితే ఇది కేవలం ఊహాగానం మాత్రమే. ఎన్టీఆర్ వలెనే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుందనే వాదనలో నిజం లేదు. అయితే 2024 మోక్షజ్ఞ హీరో కావడం ఖాయం అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.

click me!

Recommended Stories