బర్త్ డే పార్టీ అని పిలిస్తే వెళ్ళా.. రేవ్ పార్టీలో దొరికిన నటి ఆషి రాయ్, హేమ గురించి ఏం చెబుతోందో తెలుసా.. 

First Published May 22, 2024, 8:43 PM IST

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ సంఘటన టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్న నటీనటుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ సంఘటన టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో మాత్రమే కాదు రాజకీయ పరంగా కూడా ఈ సంఘటన ఒక కుదుపునకు గురి చేసింది. ఈ పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న బెంగుళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. 

పార్టీ నిర్వహించిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. బర్త్ డే పార్టీ పేరుతో బిల్డర్, బుకీ అయిన వాసు రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న నటీనటుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇప్పటికే హేమ పార్టీ వినిపించింది. 

టాలీవుడ్ యువ నటి ఆషి రాయ్ కూడా ఏ పార్టీలో దొరికింది. ఆమె బ్లడ్ శాంపిల్స్ ని కూడా బెంగుళూరు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సేకరించారు. ఈ సంఘటనపై తాజాగా ఆషి రాయ్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఏం జరుగుతుందో అందరికి తెలుసు. నా తప్పు అయితే ఏమి లేదు. బర్త్ డే పార్టీ అని ఇన్వైట్ చేశారు. పార్టీకి వెళ్ళాను. 

వాసు నాకు అన్నలాంటి వారు. పార్టీకి వెళ్లి కేక్ కట్ చేసి వచ్చేశాను. అంతకి మించి నాకు ఏమి తెలియదు. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. దానితో నాకు సంబంధం కూడా లేదు. నేను అమ్మాయిని. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. దయచేసి మీరంతా సపోర్ట్ చేసి సాయం చేయండి అని వేడుకుంది. 

నటి హేమ గారిని గతంలో కొన్నిసార్లు కలిశాను తప్ప ఆమెతో క్లోజ్ గా పరిచయం లేదు. ఈ పార్టీకి ఆమె హాజరైందా అని ప్రశ్నించగా అది నాకు తెలియదు అని ఆషి రాయ్ సమాధానం ఇచ్చింది. 

ఈ పార్టీలో పోలీసులు 45 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి కూడా తనకి ఏమి తెలియదు అని పేర్కొంది. దాదాపు 100 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

click me!