ఆ సంఘటన తర్వాత అద్దె ఇల్లు కూడా దొరకలేదు..నా కొడుకుని ఎత్తుకుని నడిరోడ్డులో ఏడ్చా, నటి జ్యోతి

First Published May 22, 2024, 7:33 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతి వ్యాంప్ తరహా పాత్రలు కూడా చేసింది. ఆమె ఎలాంటి వ్యాంప్ రోల్ చేసినా అందులో కాస్త కామెడీ టచ్ ఉంటుంది. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతి వ్యాంప్ తరహా పాత్రలు కూడా చేసింది. ఆమె ఎలాంటి వ్యాంప్ రోల్ చేసినా అందులో కాస్త కామెడీ టచ్ ఉంటుంది. ఎవడిగోల వాడిది చిత్రంలో 'సమర్పించేసుకుంటాను' అంటూ నవ్వించిన జ్యోతి ఆ తర్వాత దరువు, అల్లరి నరేష్ యముడికి మొగుడు లాంటి చిత్రాల్లో మెరిసింది.   

చిత్ర పరిశ్రమలో వ్యాంప్ తరహా పత్రాలు చేసే నటీమణులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. సరైన గౌరవం ఉండకపోగా చులకనగా చూస్తారు. అన్ని అవమానాలు దాటుకుని ఈ తరహా పాత్రల్లో నటించే వారు కొందరే ఉంటారు. వారిలో నటి జ్యోతి ఒకరని చెప్పొచ్చు. 

తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని, తలచుకుంటే కన్నీళ్లు తెప్పించే సంఘటన ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. నాపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. శృంగార పరమైన పరోపణలు నటి జ్యోతిపై ఒక సందర్భంలో వినిపించాయి. ఆ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్లిపొమ్మని చెప్పారు. 

రెండేళ్ల నా కొడుకుని ఎత్తుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగా. నాకు అద్దె ఇల్లు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనితో నా కొడుకుని ఎత్తుకుని నడి రోడ్డులో ఏడ్చినట్లు జ్యోతి పేర్కొంది. ఆ అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఎలాగైనా సొంత ఇల్లు కొనుక్కోవాలని డిసైడ్ అయినట్లు జ్యోతి పేర్కొంది. 

అదే విధంగా ఇండస్ట్రీలో కూడా తనని అవమానాలకు గురి చేసిన వారున్నారు అని పేర్కొంది. దివంగత కమెడియన్ ఏవీయస్ గారు నాపై కుళ్ళు జోకులు వేసేవారు. భరించలేక పోయేదాన్ని. ఒకసారి ఈవెంట్ కోసం యుఎస్ వెళితే.. ఈ అమ్మాయి నా టీంలో వద్దు. ఆమెకి యాక్టింగే రాదు అని ఏవీఎస్ అవమానపరిచినట్లు జ్యోతి పేర్కొంది. 

తనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఫోన్స్ స్విచాఫ్ చేసేశారు. నాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకున్నారు. ఒంటరిదాన్ని అయిపోయినట్లు అనిపించింది. నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఒకే. నా తప్పు లేకుండా కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు అని జ్యోతి పేర్కొంది. 

click me!