బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంచుకోవడం రద్దు, సీఎం సంచలన నిర్ణయం.. `గేమ్‌ ఛేంజర్‌`కి గట్టి దెబ్బ

Published : Dec 21, 2024, 04:09 PM IST

సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. ఇకపై బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంచుకోవడాన్ని రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.  

PREV
15
బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంచుకోవడం రద్దు, సీఎం సంచలన నిర్ణయం.. `గేమ్‌ ఛేంజర్‌`కి గట్టి దెబ్బ

`పుష్ప 2` సినిమా విషయంలో జరిగిన రచ్చ, సంధ్య థియేటర్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంచడాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇక తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంచుకోవడమనేది జరగదని, దాన్ని రద్దు చేస్తున్నట్టు తేల్చి చెప్పారు. 
 

25

ఇటీవల అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. బెనిఫిట్‌ షోలకు ఎనిమిది వందలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మూడు వారాలపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో టికెట్‌ రేట్లని పెంచుకునే వెసులుబాటుని సీఎం రేవంత్‌ రెడ్డి రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. 
 

35

దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా తన ప్రకటన వెల్లడించారు. తెలంగాణ బెనిఫిట్‌ షోలో ఉండవని తెలిపారు. అంతేకాదు సినిమా రిలీజ్‌కి ముందు ప్రదర్శించే షోలను రద్దు చేస్తున్నామని, టికెట్‌ రేట్లు పెంచడం కూడా జరగదని వెల్లడించారు. సీఎం ప్రకటించిన అనంతరం సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఇది ఇండస్ట్రీపై గట్టి ప్రభావం చూపించబోతుంది. వెంటనే రిలీజ్‌ కాబోతున్న సినిమాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా `గేమ్‌ ఛేంజర్‌`కి గట్టి దెబ్బే అనిచెప్పొచ్చు. 

45

 `పుష్ప 2` ప్రీమియర్స్ రోజు రాత్రి సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్‌ టీమ్‌తో కలిసి వచ్చాడు. అభిమానుల మధ్య సినిమా చూసేందుకు, ఫ్యాన్స్ లో జోష్‌ నింపేందుకు ఆయన థియేటర్‌కి వచ్చారు. ఆయన కోసం భారీగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళా అభిమాని రేవతి అక్కడిక్కడే మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ్‌ ఇంకా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. 

55

ఈ ఘటనలో థియేటర్‌ యాజమాన్యంపై, హీరో అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. బాధితుడు భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్‌ కూడా విధించింది. కానీ హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చారు. కానీ ఆ రోజు రాత్రి జైల్లో గడిపాడు. ఈ ఘటన ఇండస్ట్రీని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. 

read more: తమన్నాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? వాటి కోసం అబ్బాయిలను తోసుకుంటూ, ఒంటరిగా కూర్చొని కుమ్ముడే

also read: అనుష్కకి సమంత భార్యగా చేయాల్సింది, ఎలా మిస్‌ అయ్యింది? ఆ సినిమా ఏంటో తెలుసా?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories