షాకిస్తున్న ఎన్టీఆర్ కొత్త కారు ధర... ఓ సినిమా బడ్జెట్ అంత!

First Published Mar 3, 2021, 8:02 AM IST

స్టార్ హీరోల వేసుకునే దుస్తులు, వాడే వస్తువులు తిరిగే కార్లు... ప్రతిది వారి హోదా, ఇమేజ్, స్థాయికి తగ్గట్టు ఉండేలా ఉంటాయి. చిన్న చిన్న వస్తువుల కోసం కూడా వేలు, లక్షలు వెచ్చించే స్టార్స్ తీరు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అలాంటి వారిలో హీరో ఎన్టీఆర్ ఒకరు. తాజాగా ఎన్టీఆర్ కొనుగోలు చేసిన లగ్జరి స్పోర్ట్స్ కారు ధర ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

లగ్జరి వస్తువులు వాడడంలో ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన రిస్ట్ వాచ్, షూస్, చివరకు మాస్క్ ధర కూడా సంచలనం రేపాయి. ఇటీవల సతీసమేతంగా ఓ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ రూ. 2300 విలువ చేసే యూఎస్ స్పార్స్ట్స్ మాస్క్ ధరించారు.
undefined
ఇక ఎన్టీఆర్ ధరించే ఫార్మల్ షూస్ ధర తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఆయన ఓ సంధర్భంలో హెర్మెస్ బ్రాండ్ షూస్ ధరించి కనిపించారు. ఆ షూస్ ధర వాకబు చేయగా ఏకంగా రూ. 70 వేలకు పైమాటే అని తెలిసింది.
undefined
ఇక ఎన్టీఆర్ రిస్ట్ వాచ్ ధర తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే. రాజమౌళి కుమారుడు వివాహం కోసం జైపూర్ వెళుతూ ఎన్టీఆర్ రిచర్డ్ మిల్లె ఆర్ ఎం 11-03 మాక్ లారెన్ వాచ్ ధరించారు. ఆ మోడల్ ధర నెట్ లో ఏకంగా రూ 2.20 కోట్లుగా చూపించింది.
undefined
వాచ్ కోసమే రెండు కోట్ల రూపాయలకు పైగా కేటాయించిన ఎన్టీఆర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.  ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంపోర్టెడ్ కారు కొనుగోలు చేశారు. దాని కాస్ట్ ఒక సినిమా బడ్జెట్ అంత ఉంది.
undefined
లగ్జరి బ్రాండ్ లాంబోర్గిని ఉరుస్ కారును ఎన్టీఆర్ ఇటలీ నుండి దిగుమతి చేసుకున్నారట. ఎన్టీఆర్ ఎంతో ముచ్చటపడి కొన్న ఈ స్పోర్ట్స్ కారు ధర రూ. 5 కోట్లు అని సమాచారం అందుతుంది. ఐదు కోట్లు అంటే ఓ మోస్తరు సినిమా తెరకెక్కించవచ్చు.
undefined
మరో వైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ని రంగంలోకి దించారు.
undefined
అలాగే త్వరలో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్న చిత్ర షూటింగ్ లో  ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది.
undefined
కాగా ఈ ఏడాది బుల్లితెరపై కూడా ఎన్టీఆర్ అలరించనున్నాడు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న మీలో ఎవరికి కోటీశ్వరుడు ప్రోగ్రాంకి ఆయన హోస్ట్ గా ఉండనున్నారు.
undefined
click me!