దేవర’ (Devara) చిత్రం ‘మంగళవారం ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ట్రయిలర్ ను ముంబాయిలో మీడియా ముందు విడుదల చేసి ఒక్కసారిగా నార్త్ బెల్ట్ దృష్టి తమ సినిమాపై పడేలా చేసారు ఎన్టీఆర్ . దేవర సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారనేది నిజం. అందుకోసమే మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నా, సైఫ్ ని విలన్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఆలోచన అదే. నార్త్ లో మార్కెట్ కోసం ఎన్టీఆర్ మొదట అడుగు వేసారు. అక్కడ మీడియా కూడా బాగా కవరేజ్ ఇచ్చింది. ట్రైలర్ లాంచ్ కన్నా ముందే ఎన్టీఆర్ ముంబై వెళ్లారు ప్రమోషన్స్ కోసం. అక్కడ పేరు పొందిన మీడియా హౌస్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. తమ దేవర చిత్రం రీచ్ భారీగా ఉండాలనే రీతిలో అక్కడ ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ తెర తీసారు.