బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ లాక్ డౌన్... ఆకలేస్తే ఆపని చేయాల్సిందే...?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాగార్జున ముందుగానే చెప్పినట్టు... ఫన్ అండ్ ట్వీస్ట్ లకు కొదవ లేదు. ఫస్ట్ వీక్ హ్యాపగా ఉన్నాము అనుకుంటున్న టీమ్స్ కు  సరికొత్త షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో  సెకండ్ వీక్ నామినేషన్ల ఘట్టం కంప్లీట్ అయ్యింది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెల్లడానికి నామినేట్ అయిన వారు 8 మంది ఉన్నారు. సీజన్ 8 లో సెకండ్ వీక్ లో 8 మంది నామినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

బిగ్ బాస అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bigg boss telugu 8

ఇక ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్, నైనిక, సీత, పృధ్వితో పాటు ఓం ఆదిత్య, శేఖర్ బాషా, మణికంఠ, విష్ణు ప్రియ అన్నారు. అయితే ముందుగా విష్ణు ప్రియ ప్లేస్ లో ప్రేరణను నామినేట్ చేశారు. అయితే చీఫ్ గా ఉన్న యష్మికి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ను ఉపయోగించి విష్ణు ప్రియను నామినేట్ చేసి..ప్రేరణనుకాపాడుకున్నాను అన్నారు యష్మి. 


Bigg boss telugu 8

ఇక నామినేషన్ల టైమ్ లో  ఎప్పటిలాగా వాదోపవాదాలు.. గోడవలు కామన్ గా జరిగాయి. ఈసారి  బిగ్ బాస్  నామినేషన్స్ లో పృథ్విరాజ్ తన వాయిస్ ను కాస్త స్ట్రాంగ్ గా వినిపించాడు. అందరిని తన మాటలతో బెదరగొట్టాడు. 

ఇక నామినేషన్స్ తరువాత ఎవరికి వారు గ్రూపులుగా డివైడ్ అయ్యి.. నామినేషన్స్ పై డిస్కర్షన్స్ స్టార్ట్ చేశారు. కాగా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు షాక్ ఇచ్చాడు. ఈ వారం అంతా హ్యాపీగా వండుకుని తిన్న హౌస్ మెంట్స్ కు ఇక నుంచి ఫుడ్ ఉండదని చెప్పారు. ఎవరికి కావల్సినట్టు వారు ఆడి గెలుగచుకోవాలి అన్నారు. 
 

ఇక ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తీసేసుకున్నాడు బిగ్ బాస్. ఇక ఇంట్లో ఎవరికైనా ఆకలి వేస్తే.. టాస్క్ లు ఆడి గెలుచుకుని తినాస్లిందే. మరి ఈ విషయంలో  బిగ్ బాస్ ఈజీ టాస్క్లు పెడతాడా..? లేక ఇలా తిండి లేకుండా ఇబ్బందిపెడతారా అనేది చూడాలి మరి. 
 

Latest Videos

click me!