Siddhu Jonnalagadda: ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’కలెక్షన్స్ అంత దారుణమా?

Published : Feb 16, 2025, 07:27 AM IST

Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ యొక్క "ఇట్స్ కాంప్లికేటెడ్" (గతంలో "కృష్ణ అండ్ హిస్ లీలా") రీ-రిలీజ్ ఫ్లాట్ అయింది. OTT విడుదల థియేట్రికల్ పనితీరుపై ప్రభావం చూపిందా? నిరుత్సాహపరిచే బాక్సాఫీస్ సంఖ్యలు మరియు సినిమా భవిష్యత్తు గురించి మరింత తెలుసుకోండి.

PREV
13
Siddhu Jonnalagadda:  ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’కలెక్షన్స్ అంత దారుణమా?
Siddhu Jonnalagadda Its Complicated Re-Release Plan Backfires in telugu

 Siddhu Jonnalagadda: పాత సినిమాలు మళ్లీ రీరిలీజ్ చేయటం ఆనవాయితీగా మారింది. అందులో కొన్ని హిట్ అవుతున్నాయి. కొన్ని ఫట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం వచ్చిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల ని రీ రిలీజ్ చేసారు. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్.

ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేసీరు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్‌’గా మార్చారు. ఈ కొత్త టైటిల్, ప్రమోషన్స్ మరింత ఆసక్తిని పెంచాయి.  ఏ మేరకు సక్సెస్ అయ్యింది , కలెక్షన్స్ ఏ మేరకు వచ్చాయో చూద్దాం.
 

23
Siddhu Jonnalagadda Its Complicated Re-Release Plan Backfires in telugu


ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కృష్ణ అండ్ హిజ్ లీల మూవీని ఇట్స్ కాంప్లికేటెడ్ అని పేరు మార్చి  రిలీజ్ చేసినా  ఫలితం కనపడటం లేదు. చూడాలనుకున్న వాళ్ళు ఓటిటిలో చూసేసాం. మళ్లి థియేటర్ కు పనికట్టుకుని వెళ్లి చూసేదేముంది అన్నట్లు సైలెంట్ గా ఉండిపోయారు.   ఈ మూవీకి ఇప్పుడు టికెట్లు కూడా తెగుతున్నట్టుగా కనిపించడం లేదు.సోషల్ మీడియా కూడా లైట్ తీసుకుంది.

 సాధారణంగా  సిద్దు సినిమా అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ రీ రిలీజ్‌ను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 50 థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం ఓపినింగ్ డే రోజు  ₹7-8 లక్షలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో మరుసటి రోజు నుంచి థియేటర్స్ లో నిలబడటమే కష్టంగా మారింది. ఈ వీకెండ్ ఏమన్నా పికప్ అవుతుందేమో చూడాలి. 
 

33
Siddhu Jonnalagadda Its Complicated Re-Release Plan Backfires in telugu


 సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రాల విషయానికి వస్తే...ఆయన  హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘జాక్’ ప్రపంచవ్యాప్తంగా 2025 ఏప్రిల్ 1 విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సిద్ధు కెరీర్‌కి మరో యూ టర్న్ కానున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ ‘తెలుసు కదా’లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories