స్వర్గీయ నందమూరి తారకరామారావు పౌరాణికాల్లో దాదాపుగా అన్ని పాత్రలు పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తన కెరీర్ చివరిదశలో సైతం గుర్తుండిపోయే పాత్రలు చేశారు. చివరి దశలో ఎన్టీఆర్ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.