విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించినప్పటికీ వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, మాస్ చిత్రాలు ఇలా అన్ని జోనర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. వెంకీ కెరీర్ లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో నువ్వు నాకు నచ్చావ్ కూడా ఉంటుంది.