అల్లు అర్జున్-చరణ్ మధ్య చిచ్చు పెట్టిన దిల్ రాజు... ఎవరి సత్తా ఏంటో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా!

Published : Jul 22, 2024, 01:16 PM ISTUpdated : Jul 22, 2024, 01:48 PM IST

దిల్ రాజు నిర్ణయం అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య చిచ్చు పెట్టింది. ఇద్దరి మధ్య దూరం పెంచే పరిణామం చోటు చేసుకుంది. ఎవరి సత్తా ఏంటో తేల్చుకునేందుకు బన్నీ, చరణ్ సిద్దమయ్యారనే వాదన మొదలైంది..   

PREV
18
అల్లు అర్జున్-చరణ్ మధ్య చిచ్చు పెట్టిన దిల్ రాజు... ఎవరి సత్తా ఏంటో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా!
Ram Charan and Allu Arjun

మెగా హీరోలతో అల్లు అర్జున్ కి కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన ఉంది. ముఖ్యంగా చరణ్-అల్లు అర్జున్ చాలా కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వారిద్దరూ సోషల్ మీడియా ప్రవర్తన కూడా ఈ విషయాన్ని ధృవీకరించేలా ఉంది. అల్లు అర్జున్ మెగా హీరో ట్యాగ్ వద్దనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. 
 

28
Allu Arjun-Nagababu

ఇటీవల జరిగిన పరిణామాలు ఈ వాదనకు మరింత బలం చేకూర్చాయి. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన పార్టీకి,ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. ఆయన విజయం కోసం కృషి చేశారు. పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపాడు.

38


దీనిపై నాగబాబు పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. మెగా హీరోలతో అల్లు అర్జున్ కి చెడిందన్న ఊహాగానాల మధ్య మరొక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు-నిప్పులా ఉంటున్న రామ్ చరణ్ -అల్లు అర్జున్ బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతున్నారట. 

48
Pushpa 2 and Game Changer

పుష్ప 2- గేమ్ ఛేంజర్ రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయని విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 24కి వాయిదా పడింది. కాగా పుష్ప డిసెంబర్ 6కి ప్రీపోన్ అయ్యిందని తాజా సమాచారం. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనిపై గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు పరోక్షంగా స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.
 

58
Pushpa 2 and Game Changer

రాయన్ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్  అప్డేట్ కావాలని డిమాండ్ చేయగా.. క్రిస్మస్ కి కలుద్దాం అన్నారు. రెండు వారాల వ్యవధిలో పుష్ప 2-గేమ్ ఛేంజర్ థియేటర్స్ లో విడుదల కానున్నాయట. భారీ పాన్ ఇండియా చిత్రాలు కాబట్టి... రెండు వారాలు చెప్పుకోదగ్గ వ్యవధి కాదు. గేమ్ ఛేంజర్-పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నట్టు లెక్క. 
 

68
Allu Arjun Ram Charan

కాబట్టి రామ్ చరణ్- అల్లు అర్జున్ నువ్వా నేనా అని తేల్చుకోనున్నారు. బావబామ్మర్దుల బాక్సాఫీస్ వార్ కి దిల్ రాజునే కారణం అంటున్నారు. ఆయన నిర్ణయం మెగా హీరోల మధ్య చిచ్చు పెట్టింది అనేది ఇండస్ట్రీ టాక్. స్టార్డం, ఫేమ్ విషయంలో కూడా అల్లు అర్జున్-రామ్ చరణ్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్, పుష్ప 2 విజయం అనేది ఇద్దరికీ కీలకంగా మారింది. పరువుకు సంబంధించిన మేటర్ గా వారు భావించే అవకాశం ఉంది. 
 

78


అయితే ఇవన్నీ ఊహాగానాలే.. పుష్ప 2 డిసెంబర్ కి కూడా రాకపోవచ్చనే మరో కోణం కూడా వినిపిస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేస్తున్న సుకుమార్ అంతకంతకు ఆలస్యం చేస్తుండగా అల్లు అర్జున్ అసహనానికి గురయ్యారని, ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తయ్యాయంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను బన్నీ సన్నిహితులు ఖండించారు. అయితే ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. 

88
Mega heroes

పుష్ప 2 షూటింగ్ పూర్తి కాకపోతే మరోసారి వాయిదా పడొచ్చు. అప్పుడు గేమ్ ఛేంజర్-పుష్ప 2 మధ్య పోటీ తొలగుతుంది. అలాగే దిల్ రాజు సంక్రాంతి సీజన్ ని వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి క్రిస్మస్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపి, సంక్రాంతికి గేమ్ ఛేంజర్ విడుదల చేయవచ్చు. అందువల్ల గేమ్ ఛేంజర్-పుష్ప 2 బాక్సాఫీస్ వార్ అనివార్యం అని చెప్పలేం..

Read more Photos on
click me!

Recommended Stories