20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?

Published : Feb 27, 2025, 09:30 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్ లు సృష్టించిన స్టార్ హీరో, ప్రయోగాలకు పెట్టింది పేరు, ఏజ్ బార్ అవుతున్న కుర్రాళ్ళకు పోటీ ఇస్తోన్న ఈ హీరో దాదాపు 20 ఏళ్ళుగా  రెమ్యునరేషన్ లేకుండా సినిమాలు చేస్తున్నాడట. ఇంతకీ ఎవరా హీరో, ఎంటా కథ. 

PREV
16
20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?

పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని స్టార్ హీరోల రేట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పది కోట్లకు మించని హీరోల రెమ్యునరేషన్లు.. ఇప్పుడు వంద కోట్లకు చేరాయి. పాన్ ఇండియా సినిమాలు చేసే హీరోలు ఎవరైనా 70 కోట్లకు తగ్గడంలేదు. తక్కవలో తక్కవు 50 కోట్లకు పైనే కాని.. కిందకు దిగరు. అంతెందుకు నేచురల్ స్టార్ నానినే 40కోట్లుతీసుకుంటున్నట్టు సమాచారం. స్టార్ హీరోల హవా  ఆవిధంగా ఉంది. అటువంటిది ఓ స్టార్ హీరో రెమ్యునరేషన్ తీసుకోకండా 20 ఏళ్ళుగా సినిమాలు చేస్తున్నాడట. ఇంతకీ ఎవరా హీరో? 
 

26

ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, గత 20 ఏళ్లుగా తను చేస్తున్న సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోవడంలేదట ఆమీర్ ఖాన్.  60 ఏళ్ళు వచ్చినా యంగ్ హీరోలా మెరుపులు మెరిపిస్తూ.. ఫిట్ గా ఉన్నఈ హీరో.. నటనతో పాటు నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక్కడే ఉంది మతలబ్ అంతా.

ఆయన తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తూ.. సినిమా లాభంలో శేర్ పద్దతిలో పనిచేస్తున్నాడట. ఇతర నిర్మాతలతో సినిమా చేసినా కూడా రెమ్యునరేషన్ బదలు శేర్ తీసుకుంటున్నాడట. దీనివల్ల సినిమా తీసేవాళ్లపై జీతం ఇచ్చే భారం ఉండదు. అంతేకాదు, తక్కువ ఖర్చుతో సినిమా తీయొచ్చు అని అమీర్ ఖాన్ ఒక లైవ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ చెప్పాడు.
 

36
Bollywood actor Aamir Khan about Laal Singh Chaddha failure

ఆమీర్ ఖాన్ ఎందుకు పారితోషికం తీసుకోడంటే.. గతంలో 'లాల్ సింగ్ చద్దా' (2002) సినిమాలో కనిపించిన ఆమీర్ ఖాన్, ఒక లైవ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ చెప్పాడు. రెమ్యునరేషన్ తీసుకోకుండా  పనిచేసే నిర్ణయం సినిమా నిర్మాతలు కొత్తగా సినిమా చేయడానికి దారి చూపిస్తుందని చెప్పాడు. ఇండస్ట్రీలో అనుమానాలు ఉన్నా, డిస్లెక్సియా ఆధారంగా 'తారే జమీన్ పర్' సినిమాను ఎలా తీశానో అమీర్ వివరించాడు.
 

46
Bollywood actor Aamir Khans wedding report

'నాకు తారే జమీన్ పర్ సినిమా కథ బాగా నచ్చింది. అది విని నేను చాలా ఏడ్చాను. ఈ సినిమా నేను చేయాలనుకున్నాను. నాకు బాగా కలిసొచ్చిన విషయం ఏంటంటే, నా రెమ్యునరేషన్  సినిమా బడ్జెట్‌పై వేయలేదు. చూడండి, నా సినిమా 10-20 కోట్లలో తయారైంది. నా సినిమాలు ఎలాగైనా మంచి కలెక్షన్స్ వస్తాయి  ఆనమ్మకం నాకు ఉంది  అని అమీర్ ఖాన్ చెప్పాడు.

56

అమీర్ చెప్పిన ప్రకారం.. 20 కోట్ల బడ్జెట్ ఉంటే.. అంతకు మించి లాభం వస్తుంది.. అప్పుడు లాభాలలో శేర్ ద్వారా తాను డబ్బులు తీసుకుంటాను అన్నారు ఆమిర్. ఇది ఇఫ్పుడు కొత్తగా వచ్చింది కాదు.. కళాకారులు డబ్బు సంపాదించే పాత పద్ధతి లాంటిది.

వాళ్లు వీధుల్లో ఆడుతూ, తలకిందులుగా టోపీలు పెట్టుకుని తిరుగుతూ చూసేవాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్లు. ప్రజలకు నచ్చితే వాళ్లే డబ్బులు ఇస్తారు, లేకపోతే వెళ్లిపోతారు. అలాగే, నా సినిమాలు హిట్ అయితే నేను డబ్బు సంపాదిస్తాను, లేకపోతే లేదు" అని ఆమీర్ చెప్పాడు.
 

66

ఇందుకోసం ఆయన '3 ఇడియట్స్' ఉదాహరణగా కూడా చెప్పారు. అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' సినిమా గురించి చెబుతూ, 'మీలో చాలామంది సినిమా చూశారు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెప్పి ఉంటారు.

వాళ్ళు మళ్లీ మళ్లీ చూసినందువల్ల సినిమా బాగా డబ్బు సంపాదించింది. అందుకే నాకు కూడా లాభాల్లో వాటా వచ్చింది.నా సంపాదన సినిమాకు వచ్చే ఆదరణ, చూసే ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది' అని చెప్పాడు.

ఇక ఆమీర్ ఖాన్  సినిమాల సంగతి చూస్తే.. రజనీకాంత్ నటిస్తున్న తమిళ సినిమా 'కూలీ'లో ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు. ఇది మే 1, 2025న విడుదల కానుంది. ఈ సంవత్సరం క్రిస్మస్‌కు విడుదల కాబోయే 'సితారే జమీన్ పర్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని లైన్ చేస్తున్నట్టు తెలస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories