మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై కొత్త సస్పెన్స్, బాలకృష్ణ అంత డేర్‌ చేస్తాడా? ఏంటీ అయోమయం

Published : Feb 27, 2025, 08:29 AM ISTUpdated : Feb 27, 2025, 01:07 PM IST

Mokshagna Teja-balakrishna : నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సంబంధించిన సస్పెన్స్ పెరుగుతుంది. ప్రశాంత్‌ వర్మతో మూవీ క్యాన్సిల్‌ అనేది క్లారిటీ వచ్చింది. మరి నెక్ట్స్ ఎవరు?  

PREV
15
మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై  కొత్త సస్పెన్స్,  బాలకృష్ణ అంత డేర్‌ చేస్తాడా? ఏంటీ అయోమయం
Mokshagna Teja-balakrishna

Mokshagna Teja-balakrishna : నందమూరి బాలకృష్ణ నట వారసుడి ఎంట్రీ ఇప్పుడు అయోమయంలో పడింది. ఆయన హీరోగా పరిచయం కావాల్సిన మూవీపై సస్పెన్స్ నెలకొంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీఈ మూవీ ఆగిపోయిందని తెలుస్తుంది. దీంతో మోక్షజ్ఞ తేజ హీరోగా ఏ దర్శకుడితో పరిచయం అవుతారనేది సస్పెన్స్‌ గా మారింది. 

25
Mokshagna Nandamuri

నిజానికి మోక్షజ్ఞ తేజని `హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా నిర్మాతగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా ప్రకటించారు.

`సింబా` అనే టైటిల్‌ అనుకున్నాని తెలిసింది. సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో సడెన్‌గా ఆగిపోయింది. మోక్షజ్ఞ సిక్ అయ్యాడని గ్యాప్‌ తీసుకుని సినిమా ప్రారంభిస్తామని ఓ ప్రెస్‌ మీట్‌లో బాలయ్య తెలిపారు.
 

35
Mokshagna Teja-prasanth varma, tejaswini

కానీ ఇప్పటి వరకు సినిమా ప్రారంభం కాలేదు. అయితే ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్‌ వర్మ తప్పుకున్నాడని, బాలయ్యకి కథనచ్చలేదనే పుకార్లు వచ్చాయి. ప్రశాంత్‌ వర్మ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో బాలయ్య మార్పులు చెప్పారని, అవి మార్చడానికి ప్రశాంత్‌ వర్మ ఆసక్తి చూపలేదని ఓ కారణంగా తెలుస్తుంది.

మరోవైపు తాను కాకుండా తన అసిస్టెంట్‌తో ఈ సినిమాని డైరెక్షన్‌ చేస్తాడని ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ చేశాడని, దీనికి బాలయ్య ఒప్పుకోలేదని, దీంతో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, బాలయ్య ససేమిరా అన్నారని, దీంతో ప్రశాంత్‌ వర్మ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. 
 

45

అయితే ఇన్నాళ్లు ఇవి పుకార్లుగానే ఉన్నాయి. కానీ తాజాగా ఈ విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రశాంత్‌ వర్మ ఇప్పుడు ప్రభాస్‌ మూవీ వైపు వెళ్తున్నారు. ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రశాంత్‌ వర్మ దర్శకుడిగా ఓ మూవీ ఓకే అయ్యిందని తెలిసిందే.

దీనికి సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్‌పై టెస్ట్ షూట్‌ చేశారట. సినిమాలోని క్యారెక్టర్‌ లుక్‌, గెటప్‌కి సంబంధించిన షూట్‌ చేశారని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ లైనప్‌లో ఇది యాడ్‌ కాబోతుందట.

`స్పిరిట్‌` తర్వాత ఈ సినిమానే స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అంటే `సలార్‌ 2`, `కల్కి 2` కంటే ముందే ఈ మూవీ ప్రారంభం కానుందట. మరి అదే జరుగుతుందా? లేక `సలార్ 2`, `కల్కి 2` తర్వాత స్టార్ట్ అవుతుందా? అనేది చూడాలి. 
 

55

ప్రశాంత్‌ వర్మ తప్పుకోవడంతో ఇప్పుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఎవరితో ఉంటుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. బాలయ్య తన డైరెక్షన్‌లో `ఆదిత్య999`ని ప్రకటించారు. ఇందులో వీరిద్దరు కలిసి నటిస్తారని సమాచారం.

అలాగే వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఓ సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట బాలయ్య. మరి వీటిలో ఏది ముందు ప్రారంభమవుతుంది? మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ఎవరు దర్శకుడు ? అనే సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories