Karthika Deepam: సంతోషంలో డాక్టర్ బాబు కుటుంబం.. మరో సునామి సృష్టించడానికి పక్కా ప్లాన్ వేసిన మోనిత?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 26, 2021, 09:28 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
Karthika Deepam: సంతోషంలో డాక్టర్ బాబు కుటుంబం.. మరో సునామి సృష్టించడానికి పక్కా ప్లాన్ వేసిన మోనిత?

కార్తీక్ (Karthik) కుటుంబంకు మోనిత పీడ విరగడంతో సంతోషంగా కనిపిస్తారు. ఇక దీప (Deepa) ముఖంలో చెప్పలేని ఆనందం. కార్తీక్, ఆదిత్య, పిల్లలకు దీప, శ్రావ్య కలిసి పొడుపుకథలు వేస్తుంటారు. ఇక దానికి సమాధానం ఎంతకు చెప్పలేకపోతారు.
 

210

మరోవైపు ఆనందరావు (Ananda rao) తమ కొడుకుల టీమ్ ఓడిపోతుందని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ వాళ్లు ఎంత సమాధానం చెప్పకపోయేసరికి తిరిగి దీప సమాధానం చెబుతుంది. అంతలోనే సౌందర్య (Soundarya) స్వీట్స్ పట్టుకొని వస్తుంది.
 

310

దీపకు (Deepa) తినిపిస్తూ అసలైన దీపావళి ఈరోజే అని దీపావళి శుభాకాంక్షలు తెలుపుతుంది. ఇక కార్తీక్ (Karthik) స్వీట్ పదేపదే అడగటంతో ఎవరు కుటుంబాన్ని వాళ్లను కూర్చోబెట్టి ఇదే కదా కావాల్సింది అనుకుంటూ సంతోషపడుతుంది.
 

410

మరోవైపు మోనిత (Monitha) లాయర్ సురేష్ (Suresh) ను పిలిపించి ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మళ్లీ వంటలక్క పనిచేయాలని ఫిక్స్ అయ్యింది. ఇక తానే గెలవాలి అంటూ గట్టిగా అనుకుంటుంది. ఆ లాయర్ కూడా తనకే సపోర్ట్ చేస్తాడు.
 

510

ఆ లాయర్ అంతలోపు మరొకటి చెయ్యాలని తనకు ఏదో ప్లాన్ చెపుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో మోనిత (Monitha) లాయర్ చెప్పిన ప్లాన్ కు ఓకే అంటుంది. ఎంత రిస్క్ అయినా సరే చేస్తాను అని అంటుంది. ఇక లాయర్ మాత్రం ఆ ప్లాన్ తో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు.
 

610

ఇక కార్తీక్ (Karthik) తన గదిలో దీప దగ్గరికి వెళ్లి శ్రీ శ్రీ మహాప్రస్థానం పుస్తకంను బహుమతిగా ఇవ్వటంతో దీప ఎంతో ఆనందంగా మురిసిపోతుంది. అందులో ఉన్న కొన్ని మంచి మాటలను కార్తీక్ కు వివరిస్తుంది. ఇక కార్తీక దీప (Deepa) గొప్పదనాన్ని పొగుడుతాడు.
 

710

అలా కార్తీక్, దీప కలిసి సంతోషంగా మాట్లాడుతుంటారు. వెంటనే దీపకు (Deepa) బస్తీ వాళ్ళు గుర్తుకు రావడంతో అక్కడ వాళ్లకు ఆరోగ్యం సరిగాలేదని అనడంతో వెంటనే క్యాంప్ ఏర్పాటు చేస్తాను అని కార్తీక్ (Karthik) అంటాడు.
 

810

కార్తీక్ ఆలోచనలకు దీప (Deepa) సంతోషపడుతుంది. కార్తీక్ కూడా సంతోషంగా మాట్లాడుతూ దీపను బంగారం అని పిలుస్తాడు. మొత్తానికి వీరి మధ్య మోనిత అనే గొడవ లేకపోయేసరికి సంతోషంగా కనిపిస్తారు. మరోవైపు మోనిత (Monitha) లాయర్ కి ఫోన్ చేస్తుంది.
 

910

మోనిత (Monitha) లాయర్ తో మాట్లాడేటప్పుడు ప్రియమణి అక్కడే చాటు గా ఉండి వింటుంది. మోనిత పిలవడంతో వెంటనే వస్తుంది. ఇక తనను రెడీ అవ్వమని కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనేసరికి ప్రియమణి (Priyamani) షాక్ అవుతుంది.
 

1010

తరువాయి భాగం లో కార్తీక్ (Karthik) క్యాంపు పెట్టడంతో అక్కడికి అందరూ వచ్చి చికిత్స చేయించుకుంటారు. అదే సమయంలో ఒక మహిళ తన భర్త గురించి చెబుతుండగా మోనిత (Monitha) ఎంట్రీ ఇస్తుంది. నా పరిస్థితి కూడా అదే కదా అంటూ ప్రశ్నిస్తుంది. మొత్తానికి మోనిత ఎంట్రీ చూస్తే మాత్రం మళ్లీ ఏదో సునామి సృష్టించేలా ఉంది.

click me!

Recommended Stories