Niharika: నేను నటించడం నా భర్తకు ఇష్టం లేదు.. సమంతని ఉదాహరణగా చెబుతూ నిహారిక కామెంట్స్

First Published | Nov 26, 2021, 9:12 AM IST

మెగా డాటర్ నిహారిక ఎక్కడ ఉన్నా చలాకీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్, సినిమాలు ఇలా అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

మెగా డాటర్ నిహారిక ఎక్కడ ఉన్నా చలాకీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వెబ్ సిరీస్ లు, యూట్యూబ్, సినిమాలు ఇలా అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. హీరోయిన్ గా నిహారిక తక్కువ చిత్రాల్లోనే నటించింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. ఇంతలో నిహారిక చైతన్యని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో సెటిల్ అయింది. హీరోయిన్ గా మాత్రం నటించడం లేదు. 

తాజాగా నిహారిక Alitho Saradaga షోకి అతిథిగా హాజరైంది. ఈ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో Niharika Konidela అనేక విషయాలు పంచుకుంది. కెరీర్, వ్యక్తిగత విషయాలని నిహారిక వివరించింది. ఈ షోలో నిహారిక తన భర్త చైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యన ఎందుకు నటించడం లేదు అని అలీ నిహారికని ప్రశ్నించారు. నేను సినిమాల్లో నటించడం నా భర్తకు ఇష్టం లేదు అంటూ నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


పెళ్ళైన తర్వాత కూడా సినిమాల్లో నటించే వారు ఉన్నారు. Samantha లాంటి హీరోయిన్లకు పెళ్లి తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదు. నాకు కూడా అలా నటించాలని ఉంది. కానీ నా భర్త సినిమాల్లో నటించవద్దు అని అన్నారు. అందుకే సినిమాలు మానేసినట్లు నిహారిక పేర్కొంది. టివి, వెబ్ సిరీస్, యూట్యూబ్ లాంటి వాటికి మాత్రం ఆయన అడ్డు చెప్పలేదు. వాటిని కంటిన్యూ చేస్తా. సినిమాల్లో కూడా హీరోయిన్ గా కాకుండా ఏదైనా మంచి పాత్రలో నటించే ఛాన్స్ వస్తే నా భర్తని అడిగి నటిస్తా అని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్న నిహారిక తెలిపింది. 

ఇక తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని నిహారిక తెలిపింది. గతంలో నాకు ఆయనకు పరిచయం లేదు. మా అన్నకి ఆయన తొమ్మిదోతరగతిలో క్లాస్ మేట్. ఆరెంజ్ చిత్రంలో నాగబాబు బాగా నష్టపోయిన విషయాన్ని అలీ నిహారికతో ప్రస్తావించారు. ఆ సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ సహాయం చేశాడని నాన్నగారు గతంలో చెప్పారు. ఆ సంగతి మీకు తెలుసా అని అలీ ప్రశ్నించగా.. నాన్న గారు ఏ విషయాన్ని కూడా ప్రత్యేకంగా కూర్చోబెట్టి చెప్పరు. కానీ తెలుసు. నాన్న కింద పడి అంతే వేగంగా పైకి లేచారు అని నిహారిక పేర్కొంది. 

తమ ఫ్యామిలిలో కాకుండా తనకు రవితేజ, నాగార్జున అంటే బాగా ఇష్టం అని నిహారిక పేర్కొంది. మా ఫ్యామిలిలో నాకు, సాయిధరమ్ తేజ్ బావకి, మా చిన్న అత్తకు, నాన్నకు కొంచెం మెంటల్ ఉంది. ఏ ఫంక్షన్ జరిగినా మా నలుగురి గొంతులే బలంగా వినిపిస్తాయి అని నిహారిక సరదాగా పేర్కొంది. 

ఇక నిహారిక అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బన్నీని అన్న అని పిలవడం అలవాటు. బన్నీ ఫోటోలని చూసి ఏది ఏ చిత్రంలోదో ఇట్టే చెప్పేయొచ్చు. అల్లు అర్జున్ లో అంత వైవిధ్యం ఉంటుంది అని నిహారిక ప్రశంసించింది. బన్నీ లుక్ విషయంలో అంత కేర్ తీసుకుంటారు అని తెలిపింది. Also Read: జారిపోయిన జాకెట్, అది వేసుకోవడం అవసరమా.. హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Also Read: ఇండియాలో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఫీట్ .. తెరపై ఏ రేంజిలో పేలుతుందో

Latest Videos

click me!