100 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్, ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ అదిరిపోయే ఫారెస్ట్ సెట్..

Published : Jan 08, 2026, 02:52 PM IST

ఎన్టీఆర్ అభిమానుల కోసం ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎవరు ఊహించని విధంగా తారక్ ను చూపించబోతున్నాడు. అందుక కోసం ఏకంగా భారీ ఫారెస్ట్ సెట్ ను రెడీ చేస్తున్నాడట. 

PREV
14
ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు..

కేజీఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్ ఆడియన్స్ లో స్ట్రాంగ్ బేస్ ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్ కోసం మంచి ఆకలితో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందుకే డ్రాగన్ పై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

24
డ్రాగన్ కోసం ఎన్టీఆర్ రిస్క్..

ఎన్టీఆర్ కు తెలుగుతో పాటు కర్నాటకలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. సౌత్ లో డ్రాగన్ మూవీ భారీ ఎత్తున కలెక్ట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈసినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు తారక్.. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఎన్నీఆర్ మేకోవర్ అయ్యారు. చాలా స్లిమ్‌గా, స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ రీసెంట్ లుక్స్... అభిమానుల్లో మరింతగా ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలపాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.

34
ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

డ్రాగన్ సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతుంది.. కానీ ఇప్పటి వరకూ.. ఈసినిమాకు సబంధించి మేజర్ అప్ డేట్ ను ఇవ్వలేదు ప్రశాంత్ నీల్. దాంతో తారక్ అభిమానులు ఈ విషయంలో కాస్త గుర్రుగానే ఉన్నారు. కనీసం షూటింగ్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్లు కూడా మేకర్స్ ఇవ్వకపోవడంతో.. ఏం జరుగుతోందో తెలియక అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ సినిమాకు సబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. 100 మందితో తారక్ ఫైటింగ్ సీన్.. ప్రేక్షకులకు గూస్ బాంమ్స్ తెప్పించేదిగా ఉంటుందని అంటున్నారు.

44
డ్రాగన్ కోసం భారీ ఫారెస్ట్ సెట్..

ఈ భారీ యాక్షన్ సీన్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో.. కోట్లు ఖర్చు పెట్టి భారీ ఫారెస్ట్ సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ సినిమా కథను మలుపుతిప్పేదిగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం డ్రాగన్ మూవీ షూటింగ్ కు హాలీడే స్ ప్రకటించారట. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్నట్టు సమాచారం. అంతే కాదు డ్రాగెన్ లోని ముఖ్కమైన సన్నివేశాల కోసం.. ఫారెన్ షెడ్యుల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దానికి కావల్సిన లొకేషన్ హంట్ కోసం ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories