ఎన్టీఆర్, అల్లు అర్జున్ 4 కథలు రిజెక్ట్ చేశారు, కట్ చేస్తే ఇండస్ట్రీలో స్టార్ గా మారిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published : Jan 08, 2026, 01:30 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న డైరెక్టర్.. ఒకప్పుడు ఎన్నో రిజెక్షన్స్ ను ఫేస్ చేశాడు. అల్లు అర్జు, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కు కథలు వినిపించాడు. వాళ్లు రిజెక్ట్ చేసినా.. పట్టుదలతో ఎదిగి చూపించాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు.

PREV
15
అల్లు అర్జున్, ఎన్టీఆర్ కు కథలు వినిపించిన దర్శకుడు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్న వ్యక్తి.. ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు. స్టార్ హీరోలకు కథలు వినిపించి.. సినిమా అవకాశాలు సాధించలేకపోయాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలకోసం కథలు తయారు చేసి, వినిపించి.. అవి రిజెక్ట్ అయినా బాధపడకుండా.. పట్టుదలతో ముందు సాగిపోయాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు అనిల్ రావిపూడి.

25
రాజమౌళి తరువాత అనిల్ రావిపూడిదే రికార్డు..

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా, ఒక్క ప్లాప్ మూవీ కూడా లేని దర్శకుడిగా.. రాజమౌళి కి సరిసమానమైన రికార్డును సాధించాడు అనిల్. కానీ కెరీర్ బిగినింగ్ లో అనిల్ మంచి మంచి కథలను తయారు చేసి... కొంత మంది స్టార్ హీరోలకు వినిపించాడ. ఎన్టీఆర్ కి అయితే గతంలో రెండు, మూడు కథలు చెప్పారట అనిల్‌ రావిపూడి. అలాగే అల్లు అర్జున్‌ కి కూడా ఓ స్టోరీని నేరేట్ చేశాడట. . కానీ ఆ కథలేవీ వర్కవుట్ కాలేదు.అయినా నిరాశపడకుండా.. అందులోని ఓ కథతో.. కళ్యాణ్ రామ్ ను ఒప్పించి పటాస్ సినిమాను చేశాడు అనిల్. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. అనిల్ రావిపూడి సత్తా ఏంటో ఇండస్ట్రీకి అర్ధం అయ్యింది.

35
కెరీర్ బిగినింగ్ లో అనిల్ రావిపూడి..?

పటాస్ హిట్ తరువాత ఇండస్ట్రీలో తిరిగి చూసుకోలేదు అనిల్.. వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్ మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు. దర్శకుడిగా మారకముందు ఇండస్ట్రీలో రకరకాల విభాగాలలో పనిచేశాడు అనిల్‌ రావిపూడి. కొన్ని సినిమాలకు ఘోస్ట్‌ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, కథా, మాటల రచయితగా చాలా ఏళ్లు పని చేశారు. ఆ అనుభవంతోనే దర్శకుడిగామారాడు అనిల్. ఇప్పుడు అతను స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అనిల్ చేసిన ప్రతీ సినిమా హిట్అవుతుందన్న నమ్మకం హీరోలలో ఉంది.

45
అనిల్ గురించి చిరంజీవి కామెంట్స్..

చిరంజీవి లాంటి స్టార్ అనిల్ గురించి మాట్లాడుతూ.. నేను ఈసినిమా చేసినన్నిరోజులు బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమా నాతో ఎవరు చేయలేదు. నన్ను ఎలా వాడాలో తెలిసిన దర్శకుడు అనిల్.. నేను ఎప్పుడూ చేయని పనులు కూడా నాతో చేయించాడు.. అభిమానులకు కావలసినదానికంటే ఎక్కువ ఎలా ఇవ్వాలో అనిల్ కు తెలుసు అని కితాబిచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి పట్టుకుందల్లా బంగారం అయిపోతోంది. మొదట అనిల్ చెప్పిన నాలుగు కథలు రిజెక్ట్ అయ్యాయి. కానీ.. ఇప్పుడు అనిల్ ఏకథ చెప్పినా.. వినడానికి దర్శకులు రెడీగా ఉన్నారు.

55
సీనియర్ హీరోలతో ఎక్కువ సినిమాలు

సీనియర్ హీరోలతో ఎక్కవ సినిమాలు చేస్తున్న యంగ్ డైరెక్టర్ గా అనిల్ కు పేరు పడిపోయింది. వెంకీ, బాలయ్య, చిరు.. నెక్ట్ నాగార్జునతో అనిల్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నాగార్జునతో అద్భుతమైన సినిమా చేస్తానని..గతంలోనే అనిల్ రావిపూడి ప్రకటించాడు. ఇక నెక్ట్స్ అనిల్ టార్గెట్ టాలీవుడ్ కింగ్ అని సమాచారం. అయితే ఈలోపు అనిల్ సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మన శంకర వరప్రసాదు గారు సినిమా తరువాత అనిల్ రావిపూడి రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడటన్న టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు.

Read more Photos on
click me!

Recommended Stories