బిగ్ బాస్ తెలుగు 9 13వ వారం ఎలిమినేషన్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం స్ట్రాంగ్, క్రేజీ కంటెస్టెంట్ అయిన రీతూ చౌదరీని ఎలిమినేట్ చేశారట. సుమన్ స్థానంలో ఆమెని పంపిస్తున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 13వ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. బిగ్ బాస్ అనూహ్యమైన ట్విస్ట్ లిస్తున్నారు. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్లు తనూజ, డీమాన్ పవన్, భరణి, సంజనా, సుమన్ శెట్టి, రీతూ చౌదరీ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే బిగ్ బాస్ ఫాలోవర్స్ నిర్వహించిన పోలింగ్‌లో సుమన్ శెట్టి లీస్ట్ లో ఉంటూ వచ్చారు. అధికారిక ఓటింగ్‌లోనూ సుమన్ శెట్టి లీస్ట్ లోనే ఉన్నాడు. ఈ వారం ఆయన హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. లెక్క ప్రకారం అదే జరగాలి.
25
సుమన్ స్థానంలో రీతూ ఎలిమినేషన్
అయితే చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. సుమన్ శెట్టి స్థానంలో రీతూ చౌదరీని హౌజ్ నుంచి పంపించినట్టు తెలుస్తోంది. 13వ వారం ఎలిమినేషన్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చి రీతూ చౌదరీని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఇందులో సుమన్ శెట్టి ని సేవ్ చేశౠరని సమాచారం. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓటింగ్‌లో లీస్ట్ లో ఉన్న సుమన్ శెట్టిని కాకుండా ఆ తర్వాత స్థానంలో రీతూని ఎలిమినేట్ చేయడం షాకిస్తోంది.
35
రీతూ ఎలిమినేషన్‌కి కారణం ఇదేనా?
అయితే రీతూని ఎలిమినేట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది. ఆమెని కావాలనే హౌజ్ నుంచి పంపిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో రీతూ బాగా ఇరిటేట్ చేస్తోంది. గేమ్స్ లో ఆమె తన ఆటని ఆడటం కంటే అరుపులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి చిన్నదానికి అరుస్తూ కనిపిస్తోంది. అదే సమయంలో ప్రతి చిన్న విషయానికి ఏడస్తూ అందరిని ఇబ్బంది పెడుతుంది. సింపతీ గేమ్ ఆడుతోంది. చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతుందని, అందుకే ఆమెని ఈ వారం హౌజ్ నుంచి పంపించినట్టు తెలుస్తోంది.
అయితే రీతూ విషయంలో నెటిజన్లు కూడా అదే ఫీల్ అవుతున్నారు. హౌజ్‌లో అత్యంత ఇరిటేట్ కంటెస్టెంట్ రీతూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమెని ఇంటి నుంచి పంపించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికితోడు బిగ్ బాస్ షో ముగింపుకి ఇంకా రెండు వారాలే ఉంది. అయినా బాండింగ్‌ని వదలడం లేదు. డీమాన్ పవన్‌ని అడ్డుపెట్టుకుని సింపతీ గేమ్ ఆడుతోంది. ఇది చూసేవారికి పెద్ద నసగా మారింది. ఆట విషయంలోనూ ఇది మిగిలిన వారికి ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. అందుకే ఈ వారం రీతూ చౌదరీని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం.
55
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
అదే సమయంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ వారం సంజనా, భరణి కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరి మధ్యనే మరో ఎలిమినేషన్ ఉంటుంది. ఈ డబుల్ ఎలిమినేషన్‌పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.