ఎన్టీఆర్ ‘దేవర’ తమిళ రైట్స్ ఎంత పలికాయి, బ్రేక్ ఈవెన్ డిటేల్స్

First Published | Sep 1, 2024, 7:22 AM IST

ప్యాన్ ఇండియా స్టార్ గా దేవరతో ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ అవ్వాలని భావిస్తున్నారు. 

ntr, devara, koratala siva, Janhvi Kapoor

ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా చిత్రం  ‘దేవర’. ఆర్‌ఆర్‌ఆర్‌  తర్వాత తారక్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉండటంతో బిజినెస్ కూడా అదే స్దాయిలో జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా బిజినెస్ పరంగా క్రేజ్ నెలకొని ఉంది. ఈ క్రమంలో తమిళనాట బిజినెస్ వివరాలు చూద్దాం.
 

Devara song


ఎన్టీఆర్ ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ప్యాన్ ఇండియా స్టార్ గా దేవరతో ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ అవ్వాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు సైతం సినిమాని ఎగ్రిసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తూ ప్రమోషన్ క్యాంపైన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 


anirudh song devara


దేవర సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‍లో చాలా క్రేజ్ ఉంది. మరో ప్రక్క దేవర సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అవటం ఖరారైందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ విషయంపై ఈ సినిమా వర్గాలు స్పందించాయి. ఇంకా దేవర ట్రైలర్ డేట్‍ను తాము నిర్ణయించలేదని తెలిపాయి.


దేవర చిత్రం తమిళనాడు రైట్స్ శ్రీ లక్ష్మీ మూవీస్ వారు 7.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇది చాలా మంచి రేటు అనే ట్రేడ్ అంటోంది. ఎందుకంటే మన సినిమాలు తమిళ రైట్స్ పెద్దగా పలికిన థాకలాలు తక్కువ. తమిళ నుంచి తెలుగుకు కోట్లు పోసి తెచ్చుకుంటాం కానీ ఇక్కడ సినిమాలు అక్కడ ఎక్కువ రేటుకు ఎవరూ తీసుకోరు. ఈ నేపధ్యంలో ఏడున్నర కోట్లు అనేది మంచి రేటు పలకినట్లే అని చెప్తున్నారు. దీన్ని బట్టి తమిళంలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 18 కోట్లు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఈజిగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు.
 


రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని టాక్‌.. ఓవర్సీస్‌లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈమేరకు UKలో ఇప్పటికే  దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. 

Devara


టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింట షేర్‌ చేస్తున్నారు కూడా..  తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. సోలోగా దేవర వస్తుండటంతో బాక్సాఫీస్‌ షేక్‌ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  

devara part 1


దేవర మూవీ  తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల కోసం ప్రమోషన్లను జోరుగా చేసేలా మూవీ టీమ్ పక్కా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్లుగా చేశారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, తారక పొన్నాడ, శృతి మరాథే, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.

Latest Videos

click me!