కరోనా సమయంలో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ పాల్గొనలేదు. అయితే షో మొదలయ్యాక, కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ రాబట్టిన, అతి సామాన్యురాలు గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
అరవైయేళ్ల గంగవ్వ మొదట్లో యాక్టీవ్ గా కనిపించారు. ఏది ఏమైనా చివరి వరకు ఉండి కప్ గెలుస్తాను, మీరు ఓట్లు వేయండి అంటూ... విజ్ఞప్తి చేశారు. ఐతే ఐదు వారాల తర్వాత గంగవ్వ హౌస్ లో ఉండలేకపోయారు.
పిల్లలు గుర్తుకు వస్తున్నారని, బిగ్ బాస్ హౌస్ వాతావరణం పడడం లేదని, బయటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఇంటి నుండి బయటికి పంపారు. అయితే షోలో ఎలిమినేట్ అయ్యే వరకు ఆడకున్నా... నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు కలిసి గంగవ్వ సొంత ఇంటి కల నెరవేర్చారు.