బిగ్ బాస్ టైటిల్ ఈసారైనా మహిళకి దక్కుతుందా.. 7 సీజన్లలో ఇద్దరు మాత్రమే గట్టి పోటీ..

First Published | Aug 31, 2024, 10:28 PM IST

తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ లో 7 సీజన్లు గడిచాయి. సీజన్లు గడుస్తున్నాయి కానీ ఒక వెలితి ఉండిపోయింది. ఇంత వరకు బిగ్ బాస్ షోలో ఒక్క సీజన్ లో కూడా మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవలేదు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతోంది.. ఎంత గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ లో 7 సీజన్లు గడిచాయి. 

geetha madhuri

సీజన్లు గడుస్తున్నాయి కానీ ఒక వెలితి ఉండిపోయింది. ఇంత వరకు బిగ్ బాస్ షోలో ఒక్క సీజన్ లో కూడా మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవలేదు. ప్రతి సీజన్ లోను పురుషులే విజేతలుగా నిలుస్తున్నారు. తొలి సీజన్ నుంచి మొదలు పెడితే శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ, రేవంత్, పల్లవి ప్రశాంత్ ఇలా అందరూ పురుషులే. 


బిగ్ బాస్ 8 లో అయినా మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలుస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. గత ఏడు సీజన్లలో రెండు సార్లు మాత్రమే మహిళలు గట్టి పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచారు. 

సీజన్ 2 లో సింగర్ గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది. సీజన్ 3 లో యాంకర్ శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. మిగిలిన సీజన్స్ లో ఆ స్థాయి వరకు మహిళలు చేరుకోలేదు. సీజన్ 2లో గీతా మాధురి గేమ్ బాగా ఆడింది కానీ ఆ టైం లో కౌశల్ ఆర్మీ ప్రభావం వల్ల టైటిల్ గెలవలేకపోయింది. శ్రీముఖి.. రాహుల్ కి గట్టి పోటీ ఇచ్చింది కానీ ప్రేక్షకులు రాహుల్ సిప్లిగంజ్ కే మద్దతు తెలిపారు. మరి సీజన్ 8 టైటిల్ ఎవరిది.. ఈసారి కూడా పురుషులదేనా.. మహిళా కంటెస్టెంట్ ఎవరైనా సత్తా చాటుతారా అనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. 

Latest Videos

click me!