ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరగడంతో జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్తారా అనే చర్చ జరుగుతోంది.
పెద్ద సినిమాలు ఇప్పుడు వేరే దేశాల్లో కూడా తమ సినిమాలు రిలీజ్ చేసి అక్కడ కూడా తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో ప్రపంచాన్ని చుట్టిన ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవరతో మరోసారి ప్రపంచ పర్యటన పెట్టుకున్నట్లున్నారు. దేవర చిత్రాన్ని ప్రస్తుతం జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగతా దేశాల్లోకి కూడా వెళ్లే అవకాసం ఉందని తెలుస్తోంది.
28
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారిగా జోడీ కట్టిన చిత్రం దేవర. చిరంజీవి ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. మార్నింగ్ షోకు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా మెల్లిమెల్లిగా వీకెండ్ పూర్తయ్యేసరికి సూపర్ హిట్ అయ్యింది. కానీ, బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫామెన్స్ చూపించింది.
38
అదే సమయంలో పాన్ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర చిత్రం వరల్డ్ వైడ్‌గా భారీ లాభాలు అర్జించింది. ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
48
Ntr, Devara, koratala shiva
రీసెంట్ గా ‘కల్కి 2898 ఎడి’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనుంది. ఇక ‘దేవర’ చిత్ర ప్రీ-సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. జపాన్‌లో ఎన్టీఆర్‌కు సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ‘దేవర’ సినిమాకు కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
58
Devara
'దేవర' జపాన్ వెర్షన్ సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. సముద్రంలో తిమింగలంతో పోరాటం చేసిన భారతీయ హీరో సినిమా రాబోతోంది' అని జపాన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇక జనవరి 03 నుంచి టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నట్లు పేర్కొన్నారు. దేవరలో ఎన్టీఆర్ నటనకు ఇక్కడ మన ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ సినిమా సాలిడ్ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.
68
Devara
ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ జపాన్ కు వెళ్తారా అనే డిస్కషన్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ జపాన్‌లో రిలీజ్ సమయంలో తారక్ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు తారక్‌కు జపాన్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో దేవర రిలీజ్‌కు ఎన్టీఆర్ జపాన్ వెళ్లి ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాసం ఉందంటున్నారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి బిజిగా ఉన్నారు. రెగ్యులర్ షెడ్యూల్స్ తో ఖాళీ లేకుండా ఉన్నారు.
78
Junior NTRs Devara
ఇప్పటికే జపాన్ లో ఆర్ఆర్ఆర్, ముత్తు, బాహుబలి 2, త్రీ ఇడియట్స్, దంగల్, కెజిఎఫ్ 2 టాప్ గ్రాసింగ్ మూవీస్ గా రికార్డ్ సృష్టించాయి. అయితే ఇటీవల రిలీజైన కల్కి 2898 AD పెద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా ఉన్న చిత్రాలను జపాన్ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 'దేవర'ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
88
ntr, devara2, koratala shiva
'దేవర'లో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానులను అలరించారు.
సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఇది సంయుక్తంగా రూపొందింది.