కొత్త కోడలు శోభిత పై నాగార్జునకు ఉన్న అభిప్రాయం తెలిస్తే షాక్ అవుతారు, చైతు భార్యపై ఓపెన్ కామెంట్స్

First Published | Dec 27, 2024, 7:25 AM IST

కింగ్ నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళ్లను ఉద్దేశిస్తూ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత మీద ఆయన అభిప్రాయం ఇలా ఉంది. 

సమంతతో విడిపోయిన నాగ చైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఏడడుగులు వేశాడు. రెండేళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభిత-నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. 

ఎఫైర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన నాగ చైతన్య, శోభిత.. ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ నిరాడంబరంగా ముగిసింది. నాగార్జున సోషల్ మీడియా వేదికగా శోభితకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. 

Naga Chaitanya-Sobhita Dhulipala

డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగ చైతన్య-శోభితల వివాహం ముగిసింది. పెళ్లి సైతం సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. నాగ చైతన్య కోరిక మేరకు వివాహం సింపుల్ గా ముగించామని నాగార్జున వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున తన కొత్త కోడలు శోభితను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. 

నాగ చైతన్య కంటే ముందే శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత ధూళిపాళ్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగ చైతన్యకు భార్యగా శోభిత రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని, నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్త్వాన్ని నాగార్జున కొనియాడారు. 


నాగ చైతన్య కంటే ముందే శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత ధూళిపాళ్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగ చైతన్యకు భార్యగా శోభిత రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని, నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్త్వాన్ని నాగార్జున కొనియాడారు. 
 

శోభిత అంటే నాగార్జునకు చాలా ఇష్టమని, ఆయన మనస్ఫూర్తిగా శోభిత ధూళిపాళ్లను కోడలిగా అంగీకరించాడని ఆయన కామెంట్స్ తో అర్థం అవుతుంది. శోభిత తెలుగు అమ్మాయినే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ముంబై వెళ్లి మోడలింగ్ చేసింది. పలు వ్యాపార ప్రకటనల్లో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.
 

Naga Chaitanya-Sobhita Dhulipala

తెలుగులో శోభిత గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న గూఢచారి 2 లో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. మరి వివాహం అనంతరం కుడి శోభిత నటిస్తుందా? నటనకు గుడ్ బై చెబుతుందా? అనేది చూడాలి.

మరోవైపు నాగ చైతన్య హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్స్లోకి రానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు చందూ మొండేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Latest Videos

click me!