`దేవర` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ షాకింగ్‌.. ఒక్క దెబ్బతో రెండు సినిమాల బడ్జెట్ వచ్చినట్టే..

Published : Apr 16, 2024, 05:24 PM ISTUpdated : Apr 16, 2024, 06:37 PM IST

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు బయటకు వచ్చాయి. తారక్‌ ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే లెక్కలు వస్తున్నాయి.   

PREV
18
`దేవర` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ షాకింగ్‌.. ఒక్క దెబ్బతో రెండు సినిమాల బడ్జెట్ వచ్చినట్టే..

ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం `దేవర` చిత్రం రూపొందుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. స్టోరీ పరంగా ఈ మూవీ భారీ అంచనాలను పెంచుతుంది. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. పైగా సముద్ర బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ కావడంతో ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 
 

28

ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన `దేవర` అక్టోబర్‌కి వెళ్లింది. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్‌, షూటింగ్‌ వర్క్ డిలే కారణంగా వాయిదా వేసినట్టు తెలిసింది. దీనికితోడు దర్శకుడు కొరటాల శివ మూవీని బాగా చెక్కుతున్నారట. ఈ సారి ఏమాత్రం తేడా జరగకుండా చూసుకోవాలని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా సినిమాని డీల్‌ చేస్తున్నారని, అవిశ్రాంతం శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

38

ఇదిలా ఉంటే ఈ మూవీపై హైప్‌ తెచ్చే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బిజినెస్‌ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అంటూ కొన్ని లెక్కలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో షాకింగ్‌ లెక్కలు బయటకు వస్తున్నాయి. మతిపోయే రేంజ్‌లో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరగడం విశేషం. కొందరు నెటిజన్లు, ట్రేడ్‌ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ లెక్కలు చూస్తే. 
 

48

`దేవర` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా నాలుగు వందల కోట్ల పలుకుతుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రిక్‌ బిజినెస్‌ ఏకంగా 130కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట మేకర్స్. ఈ రైట్స్ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, దిల్‌ రాజు పోటీ పడుతున్నారు. సితార ఈ హక్కులను దక్కించుకునే అవకాశం ఉంది. 
 

58

మరోవైపు నార్త్, కర్నాటక,తమిళనాడు, కేరళాలు కలుపుకుని సుమారు 50-60కోట్లు వచ్చే అవకాశం ఉందని, మేకర్స్ ఆ పైనే డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ఓవర్సీస్‌ రైట్స్ 27 కోట్లకు (హమ్సిని ఎంటర్‌టైన్‌మెంట్‌) అమ్ముడు పోయాయి. అలాగే ఆడియో రైట్స్ 33 కోట్లకి టీ సిరీస్‌ దక్కించుకుంది. 
 

68

డిజిటల్‌ రైట్స్ పరంగా ఈమూవీ దుమ్మురేపుతుంది. నెట్‌ ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది.  ఏకంగా రూ.155కోట్ల నెట్‌ ఫ్లిక్స్ `దేవర` ఓటీటీ రైట్స్ దక్కించుకుందని సమాచారం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త కూడా. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే నిజంగా మైండ్‌ బ్లోయింగ్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. దీనికితోడు శాటిలైట్‌ రైట్స్ ఇంకా మిగిలే ఉంది. ఇవన్నీ కలిపితే 400కోట్లు దాటుతుంది. 
 

78

అంటే నిర్మాతలకు రిలీజ్‌కి ముందే ఈ మొత్తం అమౌంట్‌ రాబోతుంది. థియేట్రికల్‌ బిజినెస్‌ 220కోట్ల వరకు పలుకుతుందని చెప్పొచ్చు. ఈ లెక్కన `దేవర` మూవీ ప్రపంచ వ్యాప్తంగా మినిమమ్‌ ఐదు వందల కోట్ల గ్రాస్‌ సాధించాలి. అప్పుడే కొన్న బయ్యార్లు సేవ్ అవుతారు. ఇది బిగ్‌ టాస్కే అని చెప్పొచ్చు. ఈ లెక్కన నిర్మాతలకు మాత్రం సినిమా రిలీజ్‌ కి ముందే డబుల్‌ ప్రాఫిట్‌ అని చెప్పొచ్చు. ఇది రెండు భాగాల బడ్జెట్‌కి సమానం. 
 

88

`దేవర` చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు వస్తున్నారు కొరటాల శివ. మొదటి భాగం అక్టోబర్‌ 10న దసరా కానుకగా రిలీజ్‌ కానుంది. ఈ మూవీ హిట్‌ అయితే రెండో భాగం తెరకెక్కించనున్నారు. అయితే చాలా వరకు షూటింగ్‌ ఇప్పటికే అయిపోయిందని సమాచారం. ఇక ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఫిల్మ్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories