బిగ్ బాస్ 8లో మాజీ కంటెస్టెంట్స్...  అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ లకు మరో ఛాన్స్?

First Published | Apr 16, 2024, 4:46 PM IST

బిగ్ బాస్ సీజన్ 8 కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండగా.. ఆ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. సీజన్ 7లో పాల్గొన్న ఓ ముగ్గురు మాజీ కంటెస్టెంట్స్ భాగం కానున్నారట. 
 

Bigg Boss Telugu 7


బిగ్ బాస్ తెలుగు 7 బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పాలి. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ మినహాయిస్తే ఘనంగా ముగిసింది. భారీ టీఆర్పీ రాబట్టింది. దాంతో మేకర్స్ సీజన్ 8 వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ మొదలైందని సమాచారం. పలువురు బుల్లితెర, సినిమా సెలెబ్స్ ని నిర్వాహకులు సంప్రదిస్తున్నారట. జనాల్లో క్రేజ్ ఉన్న ప్రముఖులను కంటెస్టెంట్స్ గా తేవాలి అనుకుంటున్నారట. సీజన్ 7కి మించిన సక్సెస్ అందుకోవాలి అనుకుంటున్నారట.


కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఇదే విషయమై ఆయన్ని అడిగితే... అవకాశం వస్తే షోకి రావచ్చు. అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాలనే గట్టి లక్ష్యం నాకు లేదని అన్నాడు. 
 

Pallavi Prashanth - Sivaji

ఆయన మాట తీరు చూస్తే... పార్టిసిపేట్ చేసేలానే ఉన్నాడు. అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన కంటెస్టెంట్స్ లో ఒక ముగ్గురిని తీసుకుంటారట. 
 

Bigg boss telugu 8

అది పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. 
 

Pallavi Prashanth

కాబట్టి ఈ ముగ్గురిని సీజన్ 8లో చూసే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే. ఎలాంటి  సమాచారం లేదు. అమర్ దీప్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. శివాజీ కూడా పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాడు. కాబట్టి వాళ్లు మరలా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదు.

Latest Videos

click me!