ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ లో దుమ్ము రేపిన చిత్రాలు.. ఎన్టీఆర్‌, పవన్‌, ప్రభాస్‌, చిరు, మహేష్‌ ఎవరి సత్తా ఎంత?

First Published Dec 21, 2022, 4:17 PM IST

ప్రస్తుతం సినిమాకి వీకెండ్‌ డేస్‌ కలెక్షన్లు ప్రధానంగా మారిపోయాయి. అందులోనూ ఓపెనింగ్‌ డే కలెక్షన్లు చాలా ముఖ్యం. మరి ఈ ఏడాది ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ లో ఏ హీరో సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.. 

తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ.105కోట్లు వసూలు చేసింది. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.223కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది.
 

ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మహేష్‌బాబు నటించిన `సర్కారు వారి పాట` తొలి రోజు తెలుగు స్టేట్స్ లో రూ.50కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.75కోట్లు కలెక్ట్ చేసింది. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. 

ఇక అత్యధిక ఓపెనింగ్‌ డే కలెక్షన్లు సాధించిన హీరోల్లో మూడో స్థానంలో చిరంజీవి ఉన్నారు. ఆయన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన `ఆచార్య` చిత్రం తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ని తీసుకుంది. రూ.40కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్లకుపైగా ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. కానీ నెక్ట్స్ డేనే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఏడో స్థానం కూడా చిరుదే. `గాడ్‌ ఫాదర్‌` మూవీ 21కోట్లు రాబట్టింది.
 

నాల్గో స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. ఆయన నటించిన `భీమ్లా నాయక్‌` సినిమా తొలిరోజు తెలుగు స్టేట్స్ లో రూ.38కోట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నాలభై కోట్లకుపైగానే చేసింది. తెలుగు స్టేట్స్ లో మాత్రం పవన్‌ తన ప్రభావాన్ని గట్టిగానే చూపించారు. రానా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.
 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఐదో స్థానానికే పరిమితమయ్యారు. ఆయన నటించిన `రాధేశ్యామ్‌` 37కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎనభై కోట్లకుపైగానే ఫస్ట్ డే కలెక్షన్లని సొంతం చేసుకుంది. కానీ డిజాస్టర్‌ అయ్యింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.

కన్నడ హీరో యష్‌ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా నటించారు. ఆయన నటించిన `కేజీఎఫ్‌ 2` మూవీ రూ.1200కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో తొలి రోజు మాత్రం రూ.31కోట్లే వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లకుపైగానే వసూళ్లు చేసింది. యష్‌ ఆరో స్థానంలో నిలిచారు. 

F3 Movie

ఎనిమిదో స్థానంలో వెంకీ, వరుణ్‌ తేజ్‌లు నిలిచారు. వీరిద్దరు కలిసి నటించిన `ఎఫ్‌3` సినిమా తెలుగు స్టేట్స్ లో తొలి రోజు రూ.17కోట్లు వసూలు చేసింది. అనిల్‌ రావిపూడి దీనికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

విజయ్‌ దేవరకొండకి తొమ్మిదో స్థానం దక్కింది. ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన `లైగర్‌` మూవీ రూ.15.5కోట్లు తొలి రోజు తెలుగు స్టేట్స్ లో వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఇది ఫస్ట్ డే 33కోట్లు కలెక్ట్ చేసిందని యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమా డిజాస్టర్‌ అయిన విషయం తెలిసిందే.
 

నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన `బంగార్రాజు` పదో స్థానంలో నిలిచింది. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ ఇద్దరు నటించిన `బంగార్రాజు` తొలి రోజు రూ. 14కోట్లు వసూలు చేసింది. ఈ రకంగా హీరోలు తెలుగు స్టేట్స్ లో తమ సత్తా ఏంటో చూపించారని చెప్పొచ్చు. 

click me!