రమ్యకృష్ణ, శ్రీదేవిలపై ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌, ఛార్మినీ వదల్లేదు.. తారక్ లో ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌ ఉందా?

Published : Feb 24, 2025, 08:05 PM IST

Jr Ntr: ఎన్టీఆర్‌ ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తాడు. అదే సమయంలో బాగా అల్లరి కూడా. సినిమా సెట్లో చాలా అల్లరి చేస్తాడని చెబుతుంటారు. కానీ ఆయనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్‌ బయటపెట్టాడు. అదేంటో ఇందులో చూడండి.  

PREV
16
రమ్యకృష్ణ, శ్రీదేవిలపై ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌, ఛార్మినీ వదల్లేదు.. తారక్ లో ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌ ఉందా?
Jr Ntr, sridevi, ramya krishnan

Jr Ntr: ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ గా రాణిస్తున్న ఎన్టీఆర్‌ సీనియర్‌ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రీదేవి, ఛార్మీలపై చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. రమ్యకృష్ణ ముందు కూర్చొని బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అంతేకాదు తనలో ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌ ఉందా అనే విషయాన్ని బయటపెట్టి షాకిచ్చాడు తారక్‌. మరి ఇంతకి ఏం చేశాడంటే?

26
Jr Ntr

ఎన్టీఆర్‌కి ఒకప్పుడు హీరోయిన్‌ సమీరా రెడ్డితో లవ్‌ ట్రాక్‌ ఉందనే రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు పెళ్లి వరకు వెళ్లారని అన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కూడా ఓ అమ్మాయిని ప్రేమించాను అని తెలిపారు.

ఈ క్రమంలో సమీరా రెడ్డికి సంబంధించిన రూమర్లు మరింతగా ఊపందుకున్నాయి. కానీ వీరి లవ్‌ బ్రేకప్‌ అయ్యింది. ఆమెని ఎట్టకేలకు మర్చిపోయిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత కొన్ని రోజులకు లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

36
sridevi, ramya krishnan

మ్యారేజ్‌ తర్వాత ఓ సందర్భంలో తాను రొమాంటిక్‌ కాదు, ఈ విషయంలో ప్రణతి నుంచి ఒక్కటే కంప్లెయింట్‌ అని తెలిపారు. కానీ ఆయన హీరోయిన్ల గురించి చెప్పిన విషయాలు చూస్తే రొమాంటిక్‌ అని చెప్పకమానరు.

రమ్యకృష్ణతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్‌.. `హాట్‌` హీరోయిన్ల గురించి చెప్పారు. `యమ హాట్‌ రా బాబూ` అనిపించే హీరోయిన్‌ ఎవరు అని ఆమె అడగ్గా, రమ్యకృష్ణ, శ్రీదేవి అని చెప్పడం విశేషం. దీనికి రమ్యకృష్ణ ఉబ్బితబ్బిబ్బయ్యింది. 
 

46
sridevi, ramya krishnan

ఆ తర్వాత యమలోకంలో రంభ, ఊర్వశీ, మేనకల స్థానంలో హీరోయిన్లలో ఎవరికి ఆ స్థానం ఇస్తారనే ప్రశ్నకి ఎన్టీఆర్‌ స్పందిస్తూ, శ్రీదేవి, రమ్యకృష్ణ, రంభలకు ఆ స్థానం ఇచ్చారు. శ్రీదేవి బ్యూటీఫుల్‌ అని, రమ్యకృష్ణ హాట్‌ అని మరోసారి వెల్లడించారు. దీనికి రమ్యకృష్ణ ఫుల్‌ హ్యాపీ అయ్యింది. 
 

56
charmee

ఇక ఇందులో బాగా `వాగుడు కాయ` అనే ట్యాగ్‌ ఇస్తారని అడగ్గా, ఛార్మికి ఆ ట్యాగ్‌ ఇచ్చాడు తారక్‌. ఆమె ఎప్పుడూ వాగుతూనే ఉంటుందని, నేనే అంటే నన్ను మించిపోయింది అని చెప్పాడు ఎన్టీఆర్‌. ఇక కాస్త టూ మచ్‌ అనుకునే హీరోయిన్‌ కి రాఖీ సావంత్‌ పేరుని చెప్పాడు.

అలాగే పరమ సుత్తి అనే పేరుని కూడా ఆమెకే ఇచ్చి తెలివిగా తప్పించుకున్నారు. ఇక తన ఫేవరేట్‌ హీరోయిన్లలో భూమిక అని చెప్పాడు ఎన్టీఆర్‌. ఇది `యమదొంగ` సినిమా తర్వాత టైమ్‌ లో చేసిన ఇంటర్వ్యూ అని తెలుస్తుంది. ఇందులో మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తారక్‌. 
 

66
ntr

ఇటీవల `దేవర`తో హిట్‌ అందుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ 1960 బెంగాల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుంది.

ఇందులో పొలిటికల్‌ టచ్‌ ఉంటుందని తెలుస్తుంది. భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనబోతున్నారట. 
read  more: చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్‌ చరణ్‌

also read: Bigg Boss Telugu 9: గత సీజన్‌ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories