జమున ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తిరుగులేని ఫేమ్ అనుభవించిన నటి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో జమున చేసిన మిస్సమ్మ, గుండమ్మ కథ టాలీవుడ్ క్లాసిక్స్ అని చెప్పాలి. వెండితెరను ఏలిన ఎన్టీఆర్,ఏఎన్నార్ లనే ఢీ కొట్టింది జమున. ఆత్మాభిమానం కోసం కెరీర్ ని పణంగా పెట్టింది. మరి ఎన్టీఆర్, ఏఎన్నార్ తో ఆమె ఎందుకు విభేదించాల్సి వచ్చిందో ఓ సందర్భంలో జమున వెల్లడించారు.