చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కలవనున్న  అల్లు అర్జున్, ఎన్టీఆర్ .. ఫ్యాన్స్ కి ఇక కన్నుల పండగే 

First Published | Aug 7, 2024, 9:31 PM IST

పరిశ్రమలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ ఒకే వేదిక మీద కలవనున్నారట .

అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఒకే వేదిక పై కనిపించనున్నారు. అది కూడా ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ అని తెలుస్తుంది. దీంతో తారక్, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన నటులను చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్ లో చూడబోతున్నందుకు ఆనందంలో ఉప్పొంగి పోతున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూదాం .. 

ఎన్టీఆర్, అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 తో అల్లు అర్జున్, దేవర, వార్ 2 సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. కాగా దేవర మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగల్ ఆకట్టుకుంటుంది. నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.  సెప్టెంబర్ 27న దేవర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇది పక్కన పెడితే .. బన్నీ, తారక్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరదాగా తారక్ ని బావ అని పిలుస్తుంటారు. గతంలో కూడా ఓ వేదికపై ఇద్దరూ కలిసి సందడి చేశారు. 

ntr, allu arjun

ఆ సమయంలో ఒకరిపై ఒకరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకున్నారు. తారక్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ' రియల్ ట్యాలెంట్ ' అని అల్లు అర్జున్ అన్నారు. బన్నీ అమేజింగ్ ఫ్రెండ్ .. కష్టపడి పైకి వచ్చిన వారిలో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి అని అల్లు అర్జున్ గురించి ఎన్టీఆర్ చెప్పడం విశేషం. అయితే వీరి బాండింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ  వీడియో క్లిప్ తెగ ట్రెండ్ అయింది. తారక్, బన్నీ ని ఒకే ఫ్రేమ్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 


అయితే త్వరలో వారి కోరిక ఫలించనుంది. ఒకే ఫ్రేమ్ కాదు కానీ ఒకే స్టేజి పై అల్లు అర్జున్, ఎన్టీఆర్ కనిపించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' ఆయ్ '. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ కి సంబంధించిన జిఏ2 పిక్చర్స్  బ్యానర్ పై తెరకెక్కింది. కాగా ' ఆయ్ ' మూవీ ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 

Latest Videos

click me!