రాంగ్ వేలో కొడుకు కెరీర్, అయినా అల్లు అరవింద్ సైలెంట్.. అసలేం జరుగుతోంది ?

First Published | Aug 7, 2024, 9:06 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచి అల్లు అర్జున్ కెరీర్ ని అల్లు అరవింద్ చాలా చక్కగా బిల్డ్ చేస్తూ వచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచి అల్లు అర్జున్ కెరీర్ ని అల్లు అరవింద్ చాలా చక్కగా బిల్డ్ చేస్తూ వచ్చారు. సినిమాల విషయంలో అల్లు అరవింద్ జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుంది. అంతటి అనుభవం ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ ఆయన. 

అల్లు అరవింద్ చిన్న కుమారుడిగా, అల్లు అర్జున తమ్ముడిగా అల్లు శిరీష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ స్థాయిలో కాకున్నా శిరీష్ ని కూడా అల్లు అరవింద్ మంచి పొజిషన్ లో నటుడిగా నిలబడతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదు. అల్లు శిరీష్ కి వరుసగా ఫ్లాపులు పడుతూనే ఉన్నాయి. 


కథల ఎంపిక విషయంలో అల్లు శిరీష్ కంప్లీట్ గా రాంగ్ ట్రాక్ లో వెళుతున్నాడు. ఇటీవల విడుదలైన బడ్డీ చిత్రంతో శిరీష్ కి ఝలక్ తప్పలేదు. ఇంత జరుగుతున్నా అల్లు అరవింద్ మాత్రం శిరీష్ కెరీర్ ని పట్టించుకుంటున్నట్లు అనిపించడం లేదు. ఒక మంచి కథ సెట్ చేసి తన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే శిరీష్ తో సినిమా చేయడం అల్లు అరవింద్ కి కష్టమైన పని కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని మీడియా కూడా శిరీష్ ని ప్రశ్నించింది. కానీ ఆ ప్రశ్నకి బదులివ్వకుండా శిరీష్ స్కిప్ చేశాడు. కెరీర్ ఆరంభంలో మాత్రమే అల్లు అరవింద్ శిరీష్ సినిమాలపై కాస్త ఫోకస్ పెట్టారు. 

కానీ ఇప్పుడు అది జరగడం లేదు. శిరీష్ గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమాలు కూడా వర్కౌట్ కావడం లేదు. శిరీష్ కి తన కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఇంకా దక్కలేదు. శ్రీసరస్తు శుభమస్తు చిత్రం మాత్రం పర్వాలేదనిపించింది. 

Latest Videos

click me!