వెన్నెల కిషోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడంటే...?

First Published | Aug 7, 2024, 8:24 PM IST

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు వెన్నెల కిషోర్.. తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ను సెట్  చేసుకున్నాడు. ప్రస్తుతం భారీగా డిమాండ్ ఉన్న ఈ కమెడియన్.. ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు..? ఇంతకు ముందు ఏం చేసేవాడు..? 

సునిల్ తరువాత అంత డిఫరెంట్ గా కామెడీ చేయగల కమెడియన్ గా పేరు ఉంది వెన్నెల కిషోర్ కు. డిఫరెంట్ మాడ్యూలేషన్.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో.. ఎవరిని అనుకరించకుండా..తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను సెట్ చేసుకున్నాడు ఈ స్టార్ కమెడియన్. తను చేసిన మొదటి మూవీ వెన్నెలతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన కిషోర్.. వెన్నెల సినిమా ఇంటిపేరుగా మారి.. వెన్నెల కిషోర్ అయ్యాడు. 

బ్రహ్మానందానికి సినిమాలు తగ్గడంతో వెన్నెల కిషోర్ డిమాండ్ పెరిగిపోయింది. సునిల్ కూడా హీరోనగా మారడంతో.. కిషోర్ స్టార్ డమ్ చాలా ఈజీగా వచ్చేసింది. ప్రతీ సినిమాలో తన టాలెంట్ చూపిస్తూ.. ఎదిగిన వెన్నెల కిషోర్.. చార్లీ 111 మూవీతో హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం కమెడియన్ గా  చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న వెన్నెల కిషోర్... సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..? సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా..? 


హైదరాబాద్ దగ్గరలో ఉన్న కామారెడ్డిలో పుట్టి పెరిగిన కిషోర్‌.. టెన్త్ వరకూ అక్కడే చదుకున్నాడు.. ఆతరువాత ఇంటర్, డిగ్రీకోసం హైదరాబాద్ వచ్చిన ఆయన... పై చదువులకు అమెరికా వెళ్ళాడు. చదువులో ముందుండే కిషోర్... జీఆర్ఈ, టోఫెల్ లో మంచి స్కోర్ సంపాదించాడు.. వెంటనే హైయ్యర్ ఎడ్యూకేషన్ కోసం  అమెరికాకు వెళ్లాడు. మిచిగాన్‌లోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి.. వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా జావ్ చేశాడు కిషోర్. 
 

మంచి జాబ్.. లక్షల్లో జీతం.. ల‌గ్జ‌రీ లైఫ్.. ఇలా హ్యాపీగా లైఫ్ ను  లీడ్ చేస్తున్నటైమ్ లో.. కిషోర్ లో ఉన్న సినిమా ప్రేమికుడు బయటకు వచ్చాడు. అమెరికాలో జరుగుతున్న వెన్నెల సినిమా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.   డైరెక్ట‌ర్ దేవ కట్టా సినిమా చేస్తున్నాడని.. అది మొత్తం అమెరికాలోనే షూటింగ్ ఉంటుందని.. ఇక్కడ యాక్టర్లకోసం వెతుకుతున్నారని తెలిసి..  కిషోర్‌ దేవ కట్ట దగ్గరకు వెళ్ళాడు.. ముందు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు.. ఆతరువాత తన టాలెంట్ చూపించి అదే సినిమాలో నటుడిగా మారాడు.  
 

ఈసినిమా దాదాపు షూటింగ్ అంతా అమెరికాలోని మిచిగాన్‌లో జ‌రుపుకుంది. అయితె వెన్నెల సినిమాలో  కిషోర్ చేసిన పాత్ర శివారెడ్డి చేయాల్సింది. అతను అమెరికా రావడానికి ఏవో ప్రాబ్లమ్స్ రావడంతో.. ఆ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ చేశాడు. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ.. తనకు ఉన్న సెలవులు వాడుకుంటూ..షూటింగ్ లో పాల్గోనేవాడు వెన్నెల కిషోర్..

అలా ఆ సినిమా కంప్లీట్ చేశాడు. 2005 లో రిలీజ్ అయిన ఈసినిమాలో వెన్నెల కిషోర్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే.. అయితే ఆతరువాత వచ్చిన అవకావాలు కిషోర్ వదులుకున్నారు. మళ్ళీ రెండేళ్ళ తరువాత ఉద్యోగం మానేసి కంప్లీట్ గా సినిమాల వైపు వచ్చాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయిని పెళ్ళాడి.. హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు వెన్నెల కిషోర్. 

Latest Videos

click me!