అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మధ్య సీక్రెట్‌ ఒప్పందం.. మహేష్‌ విషయంలో రూట్‌ మార్చిన స్టార్‌ హీరోల ఫ్యాన్స్

Published : Jan 07, 2024, 08:39 PM IST

స్టార్‌ హీరోల ఫ్యాన్స్ మధ్యతరచూ వార్‌ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు రూట్‌ మార్చారు. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నారు. నయా ఒప్పందంతో ముందుకు వెళ్తున్నారు. 

PREV
16
అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మధ్య సీక్రెట్‌ ఒప్పందం.. మహేష్‌ విషయంలో రూట్‌ మార్చిన స్టార్‌ హీరోల ఫ్యాన్స్

ఏ చిత్ర పరిశ్రమలో అయిన ఫ్యాన్స్ మధ్య తరచూ వార్‌ జరుగుతుంటుంది. సినిమాల సమయంలో ఆ వార్‌ మరింతగా ఉంటుంది. వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునేంతగా ఈ వార్‌ జరుగుతుంది. సినిమాలనే కాదు, ఫ్యామిలీ విషయాల వరకు వెళ్లి కంపు కంపు చేస్తుంటారు. ఇటీవల సృతి మించిన వ్యవహారం నడుస్తుంది. స్టార్‌ హీరోల వైఫ్‌ల ఇన్‌ వాల్వ్ చేసేంత వరకు వెళ్తున్నారు. ఇది నిజంగా అత్యంత విచారకరం. 
 

26

ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఫ్యాన్స్ మధ్య మార్పు వస్తుంది. వారి ఆలోచనలో చాలా మార్పులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మార్పుకి ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ శ్రీకారం చుడుతున్నారు. ఒకరికొకరు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాదు సీక్రెట్‌ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మాకు మీరు, మీకు మేము అంటున్నారు. అంతేకాదు చాలా కాలంగా ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం నడుస్తుందనే విషయాన్ని వెల్లడించారు. 

36
ntr, allu arjun

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ బావ, బావ అని పిలుచుకుంటారు. పుట్టిన రోజుల్లోనే, ఏదైనా సాధించిన సమయంలో వాళ్లు ఒకరినొకరు స్పందించే తీరు, ఆప్యాయంగా విషెస్‌ చెప్పిన తీరు అబ్బురపరుస్తుంది. వీరి అనుబంధం ముచ్చటగా ఉంటుంది. దీంతో అదే స్నేహాన్ని ఫ్యాన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. 

46

`అల వైకుంఠపురములో` చిత్రానికి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారట. `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి బన్నీ ఫ్యాన్స్ సపోరట్ చేశారట. అలాగే `దేశముదురు` రీ రిలీజ్‌ సమయంలో తారక్‌ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారని, దీంతో `సింహాద్రి` రీ రిలీజ్‌ టైమ్‌లో తిరిగి ఇచ్చేశారట. `పుష్ప` సినిమాకి తారక్‌ ప్యాన్స్ చేశారని, `దేవర`కి కూడా తిరిగి ఇచ్చేద్దామని సోషల్‌ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. `దేవర` సినిమాకి బన్నీ ఫ్యాన్స్‌ సపోర్ట్ చేస్తే `పుష్ప2`కి సపోర్ట్ చేస్తామని అంటున్నారు. 
 

56

అయితే ఇక్కడే ఓ కొత్త వాదన తెరపైకి వచ్చింది. జనరల్‌గా మహేష్‌బాబు ఫ్యాన్స్, బన్నీ అభిమానుల మధ్య తరచూ వార్‌ జరుగుతుంటుంది. `అల వైకుంఠపురములో` చిత్రం నుంచి ఇది ఊపందుకుంది. అదే సమయంలో `సరిలేరు నీకెవ్వరు` రావడంతో మాదంటే మాది అని ట్రోల్‌ చేసుకున్నారు. దారుణంగా వార్‌కి దిగారు. నెట్టింట రచ్చ రచ్చ చేశారు. కానీ గత ఆరునెలలుగా ఈ విమర్శలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారట. మహేష్‌ ఫ్యాన్స్ ఇటీవల బన్నీ సినిమాలను ట్రోల్ చేయలేదట. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా `మనం కూడా చేయోద్దని` అనుకోవడం విశేషం.
 

66

అయితే మరికొందరు ఎప్పటిలాగే విమర్శలు చేస్తుండగా, సపోర్ట్ చేయకపోయినా ఫర్వాలేదు, ట్రోల్ చేయకండి అని, నెగటివ్ ప్రచారం చేయకండి అని చర్చించుకోవడం విశేషం. ఫ్యాన్స్ మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం, ఒక పాజిటివ్‌ చర్చ స్టార్ట్ కావడం అభినందనీయం. ఇలానే మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇండస్ట్రీలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories