ఈ మూవీ ఆడియో రైట్స్ లోనూ రికార్డు బ్రేక్ చేసింది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్`, `సలార్` వంటి చిత్రాలను దాటేసింది. ఇటీవల `దేవర` ఆడియో రైట్స్ ని టీ సిరీస్ దక్కించుకుంది. భారీ ధరకి తీసుకుందట. సుమారు 28కోట్లకు ఆడియో అమ్ముడు పోయిందట. ఇది `ఆర్‌ఆర్‌ఆర్`, `సలార్`, `యానిమల్` చిత్రాలకంటే ఎక్కువ. `ఆర్‌ఆర్‌ఆర్` 25కోట్లకు పోగా, `సలార్` 12కోట్లకు, `యానిమల్` మూవీ 16కోట్లకు అమ్ముడు పోయాయి. తాజాగా ఈ చిత్రాలను ఎన్టీఆర్ మూవీ దాటేయడం విశేషం.