తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. కాబట్టి మేము ఇంకా కష్టపడాల్సి ఉంది. నాణ్యమైన చిత్రాలు తెరకెక్కించాల్సిన బాధ్యత పెరిగింది. ఒక సినిమా తీయడం ఆషామాషీ కాదు. కీలకమైన అప్డేట్ ఉంటే భార్య కంటే కూడా ముందు మీకే చెప్తాము. కాబట్టి అప్డేట్ కావాలంటూ మేకర్స్ మీద ఒత్తిడి తేవద్దు. నా అభిమానులకే కాదు, ప్రతి హీరో అభిమానికి నేను చేసే రిక్వెస్ట్ ఇది, అని సీరియస్ అయ్యాడు.